హైవేపై సాధువుల రూపంలో దొంగలు.. ఆశీర్వదిస్తామని నిలువు దోపిడీ(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-17 06:09:57  IST  )

* సాధువుల రూపంలో దొంగలు * ఆశీర్వదిస్తామని నిలువు దోపిడీ * సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో * జాగ్రత్తగా ఉండాలని పోలీసుల సూచనలు

హైవేపై సాధువుల రూపంలో దొంగలు.. ఆశీర్వదిస్తామని నిలువు దోపిడీ(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో కొత్త రకం దొంగలు వెలుగులోకి వచ్చారు. సాధువుల రూపంలో వేశాలు వేసుకున్న దొంగలు.. ఆశీర్వాదాలు అందిస్తామని హైవేపై వెళ్తున్న కార్లను ఆపుతున్నారు. ఆ తర్వాత వాహనాన్ని ముందుకు కదిలిస్తే.. భస్మం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కదలకుండా అక్కడే ఉండటంతో నిలువునా దోచేస్తున్నారు. కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు పెరిగిపోవడంతో.. పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రాకేష్ రాజ్‌పుత్, బిర్జు నాథ్, రాముల్ నాథ్, రమేశ్ నాథ్, అరుణ్ నాథ్, మగన్ నాథ్, అలీ నాథ్‌గా గుర్తించారు.

Click For Twitter Post ..

Next Story