- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగతనం చేసి.. AC ఆన్ చేసుకొని హాయిగా నిద్రపోయాడు !
దొంగతనం చేసి.. AC ఆన్ చేసుకొని హాయిగా నిద్రపోయిన వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. బంగారం ధరలు కొండెక్కిన నేపథ్యంలో ఇంటికి తాళాలు వేసి ఉంటే, రంగంలోకి దిగిపోతున్నారు దొంగలు. ఈ క్రమంలో బంగారం, డబ్బులు దొంగిలిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గుజరాత్ లోని నవసారిలో ఓ దొంగ చేసిన పని హాట్ టాపిక్ అయింది. రాత్రి 10 గంటల సమయంలో తన ముఖానికి బట్ట కట్టుకొని, ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలోకి దొంగతనానికి వెళ్ళాడు.
ఈ క్రమంలో ఆఫీసులో ఉన్న లాకర్ నుంచి దాదాపు రూ. 60 వేలు తీసుకున్నాడు. 10 గ్రాముల వెండి కూడా దొంగిలించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోకుండా.. ఉక్కపోతగా ఉందని ఏసీ ఆన్ చేశాడు. అయితే ఏసీ నుంచి చల్లటి గాలి వచ్చిన నేపథ్యంలో కునుకు తీశాడు దొంగ. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల పాటు ఆఫీసులోనే నిద్రపోయాడు. ఉదయం 4:53 గంటలకు నిద్రలేచి, అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.






