అసలు వీళ్ల లిప్ సింక్ ఉంది భయ్యా.. సూపరో సూపరు.. తెలుగు నటీనటులు కూడా ఇంత బాగా చేయలేరు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-04 12:40:47  IST  )

ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాలకు, పాటలకు విదేశాల్లో క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది.

అసలు వీళ్ల లిప్ సింక్ ఉంది భయ్యా.. సూపరో సూపరు.. తెలుగు నటీనటులు కూడా ఇంత బాగా చేయలేరు!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాలకు (Indian cinemas), పాటలకు విదేశాల్లో క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలకు, పాటలకు విదేశీయులు (Foreigners) ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమాల్లో ఫేమస్ డైలాగులు, పాటలు అనుకరిస్తూ రీల్స్ (Reels) చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఎన్నో రీల్స్ నెట్టింట వైరల్ అవ్వటం మనం చూశాం. తాజాగా మరో వీడియో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. ఆఫ్రికాకు చెందిన ఓ యువతి, యువకుడు తెలుగు పాటకు అద్భుతంగా రీల్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. మరీ ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

టాంజానియా (Tanzania) దేశానికి చెందిన కిలీ పాల్ తన సోదరి నీమా పాల్‌తో కలిసి గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ త్రిష కలిసి నటించిన వర్షం మూవీలోని 'మెల్లగా కరుగని ఈ వర్షం సాక్షిగా' పాటకు రీల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ రీల్‌లో వీరి హావభావాలు, టైమింగ్ చూస్తే.. టాలీవుడ్ స్టార్లకూ ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ఈ వీడియో చూసిన ఎవ్వరైనా వావ్ అనాల్సిందే. అంతా పర్‌ఫెక్ట్‌గా లిప్ సింక్ చేస్తూ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం ఎంతో మంది టాలీవుడ్ నటీనటులకంటే వీళ్లు ఎంతో అద్భుతంగా చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తున్నారు. కాగా, ఈ ఇద్దరు అన్న చెల్లెలు.. గత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాల్లోని డైలాగ్స్, పాటలకు రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు.

Click For Tweet..

Next Story