Shocking news: రైలుపై నడిచిన యువకుడు.. చివరకు అతడి పరిస్థితి ఏం అయిందంటే?

by Chukka Sudharani |

మనం పొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు సోషల్ మీడియాలో(social media)నే ఉంటున్నాము.

Shocking news: రైలుపై నడిచిన యువకుడు.. చివరకు అతడి పరిస్థితి ఏం అయిందంటే?
X

దిశ, ఫీచర్స్: మనం పొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు సోషల్ మీడియాలో(social media)నే ఉంటున్నాము. ఎన్నో కామెడీ (Comedy) వీడియోలతో పాటు మరెన్నో షాకింగ్ వీడియోలు (Shocking videos) కూడా నెట్టింట ప్రత్యక్షమవుతూ మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇలా చాలా మంది రీల్స్ చూసి సంబరపడుతుంటే.. మరికొందరు ఏదో ఒకటి చేసి వైరల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ నెట్టింట ట్రెండింగ్‌లో ట్రై చేస్తారు. ఈ క్రమంలోనే పాపులర్ అవ్వడం సంగతి పక్కకు పెడితే.. కొందరూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

ఓ యువకుడు రైలు పైకి ఎక్కి నడుస్తూ వెళ్తున్నాడు. కింద నుంచి ఎవరు ఎంతలా అరిచినా అదేమీ పట్టించుకోకుండా ఒక వైపు నుంచి మరో వైపునకు నడుస్తున్నాడు. ఈ క్రమంలో రైలుపై ఉండే హైటెన్షన్ విద్యుత్ లైన్లు (High-tension power lines) తగులుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే ఆ వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియనప్పటికీ ప్రజెంట్ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతడి తీరుపై మండిపడుతున్నారు నెటిజన్లు. రీల్స్ కోసం చేశాడో లేక చనపోవడానికి ఇలా చేశాడో ఇంకా దీనిపై ఎలాంటి వివరాలు తెలియలేదు.

Next Story