- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వావ్.. ప్రపంచంలోనే అత్యంత చిన్న కారును చూశారా..? కేవలం 50 సెంటిమీటర్లే..!
వావ్.. ప్రపంచంలోనే అత్యంత చిన్న కారును చూశారా..? కేవలం 50 సెంటిమీటర్లే..!

దిశ, ఫీచర్స్ : సాధారణంగా కార్లు బ్రాండ్ అండ్ మోడల్‌ని వివిధ సైజుల్లో ఉంటాయి. ఏ సైజ్ అయినప్పటికీ నలుగురు వ్యక్తులు పట్టేలా మినిమమ్ ఉంటాయి. కానీ కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రమే పట్టే సైజులో ఉండే అతిచిన్న కారును ఎప్పుడైనా చూశారా? దాదాపుగా ఇప్పటి వరకైతే లేకుండె. కానీ రీసెంట్‌గా ఇటలీకి చెందిన ఓ వ్యక్తి దీనిని తయారు చేశాడు. కేవలం ఒకే వ్యక్తి కూర్చొని, సొంతంగా డ్రైవ్ చేసుకుంటు మాత్రమే వెళ్లగలిగే ఈ అతి చిన్న ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ క్యూరియాసిటీని పెంచుతోంది.
ప్రపంచంలోనే అత్యంత చిన్న ఎలక్ట్రిక్ కారు(The smallest electric car)ను తయారు చేసింది ఎవరో కాదు, ఆండ్రియా మరార్జీ అనే ఒక సాధారణ మెకానిక్ మాత్రమే. కేవలం 50 సెంటిమీటర్ల వెడల్పుగల కారును సొంతంగా బిల్డ్ చేసిన ఇతను, ఇటలీలో జరిగిన పాండా ఏ పాండినో(Panda a Pandino)’ అనే ఈవెంట్‌లో దానిని ప్రదర్శించాడు. అయితే బ్లూ కలర్‌లో పెయింట్ చేయబడిన ఈ అల్ట్రా థిన్ (ultra-thin), కస్టమ్ బిల్ట్ (custom-built) ఎలక్ట్రిక్ ఫియట్ పాండా ప్రేక్షకులను అమితంగా ఆకట్టకుకుంది. ఈ కారుకు ఒకే హెడ్ లైట్, అతి సన్నని చక్రాలు, రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి. వెనుక సీటు చాలా చిన్నది. ముందున్నది మాత్రమే కూర్చోవడానికి వీలుంటుంది. కాబట్టి డ్రైవర్ ఒక్కరే కూర్చొని నడపొచ్చు. ఒకే వ్యక్తి ఎక్కడికైనా వెళ్లగలిగేందుకు ఇది ఉపయోగపడుతుంది.






