- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షి.. యువతిపై ఒక్కసారిగా దాడి!
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక, సామాజిక మాధ్యమాల్లో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలకు కొదువే లేదు. ఈ వీడియోలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యకరంగా, మరికొన్ని షాకింగ్ గానూ ఉంటాయి. తాజాగా నెట్టింట ఓ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్ గురయ్యారు.
ఇంతకీ అదేమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షిగా పేరుగాంచిన 'కాసోవరీ' (Cassowary) ఆస్ట్రేలియాలోని ఒక బీచ్‌లో యువతిని వెంబడించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సదరు యువతి సరదాగా గడుపుతుండగా.. ఈ పక్షి ఒక్కసారిగా దాడికి సిద్ధమై ఆమెను వెంటాడింది. బలమైన కాళ్లు, పదునైన గోర్లతో ప్రాణాంతకంగా మారే ఈ పక్షిని చూసిన ఆ యువతి తీవ్ర భయాందోళనకు గురైంది. ప్రాణభయంతో ఆమె పరిగెత్తుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






