ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు..! ప్రకృతి సృష్టించిన అరుదైన ఘటన.. వీడియో వైరల్

by Ramesh Naini |

ప్రకృతి ఎన్నో వింతలతో నిండి ఉందో మరోసారి రుజువైంది. స్పైడర్ వెబ్‌లు సాధారణంగా అందరూ చూసే ఉంటారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు..! ప్రకృతి సృష్టించిన అరుదైన ఘటన.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రకృతి ఎన్నో వింతలతో నిండి ఉందో మరోసారి రుజువైంది. స్పైడర్ వెబ్‌లు సాధారణంగా అందరూ చూసే ఉంటారు. స్పైడర్ కట్టుకునే గూడులు తక్కువ పరిమాణంలో ఉండటం అందరికీ తెలిసిందే. కానీ అల్బేనియా–గ్రీస్ సరిహద్దులోని ఒక గుహలో పరిశోధకులు ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు (largest spiderweb) కనుగొన్నారు. సుమారు 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ గూడు, దాదాపు 1.11 లక్షల సాలీళ్ల నివాసంగా ఉంది. ప్రకృతి సృష్టించిన అరుదైన ఘటనగా శాస్త్రవేత్తలు దీన్ని అభివర్ణించారు.

సూర్యకాంతి చేరని, అధిక హైడ్రోజన్ సల్ఫర్ వాయువు ఉన్న ఆ గుహలో ఈ భారీ గూడు ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే, రెండు వేర్వేరు జాతులకు చెందిన సాలీళ్లు కలిసి ఈ గూడు నిర్మించాయి. ఈ ఆవిష్కరణపై సబ్‌టెర్రేనియన్ బయాలజీ జర్నల్‌ (Subterranean Biology) పత్రికలో పరిశోధన వివరాలు ప్రచురించబడ్డాయి. ప్రధాన రచయిత ఇస్త్వాన్ ఉరాక్ మాట్లాడుతూ.. ‘ప్రకృతిలో ఇంకా ఎన్నో ఆశ్చర్యాలు దాగి ఉన్నాయి. ఆ గూడు చూసినప్పుడు మాలో కలిగిన భావాలను వర్ణించలేము, అవి ఆశ్చర్యం, గౌరవం, కృతజ్ఞతల మేళవింపు’ అని పేర్కొన్నారు. కాగా, ఈ అతిపెద్ద సాలీడు గూడుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కోసం క్లిక్ చేయండి..

Next Story