- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనిషి సైజు గబ్బిలం.. ఫొటోలు వైరల్
by Sujitha Rachapalli |
గోల్డెన్-క్రౌన్డ్ ఫ్లైయింగ్ ఫాక్స్.. అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గబ్బిలాల్లో ఒకటి. రెక్కల విస్తీర్ణం ఆరు అడుగులు కలిగిన ఈ గబ్బిలం.. పండ్లు తిని

X
దిశ, వెబ్ డెస్క్ : గోల్డెన్-క్రౌన్డ్ ఫ్లైయింగ్ ఫాక్స్.. అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గబ్బిలాల్లో ఒకటి. రెక్కల విస్తీర్ణం ఆరు అడుగులు కలిగిన ఈ గబ్బిలం.. పండ్లు తిని బతుకుతుంది. ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థల్లో పరాగ సంపర్కం, విత్తన వ్యాప్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే అడవుల నిర్మూలన కారణంగా ఈ జాతి గబ్బిలాలు ఆహారం కోసం వేటాడుతూ.. మనుషుల నివాసాలకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఫిలిప్పీన్స్‌లోని ఓ ఇంట్లో మనిషి సైజు గబ్బిలం కనిపించి హడలెత్తించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు.. దాన్ని సేఫ్‌గా తీసుకెళ్లారు. సంరక్షణ ప్రయత్నాలు చేపట్టారు. కాగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ గబ్బిలం జాతి అంతరించిపోతున్న జాబితాలో ఉండగా.. ప్రస్తుతం కేవలం పదివేల కంటే తక్కువే ఉన్నాయని తెలుస్తోంది.
Next Story






