- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తవ్వుకున్నోడికి.. తవ్వుకున్నంత.. టూరిస్ట్ ప్లేస్‌లో వజ్రాలే, వజ్రాలు.. ఇంతకీ ఎక్కడంటే?
సహజంగా భూమిలో ఏర్పడే వజ్రాలు చాలా విలువ కలిగి ఉంటాయి. ఇవి లక్షలాది సంవత్సరాల పాటు భూమి లోతుల్లో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య రూపుదిద్దుకుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: సహజంగా భూమిలో ఏర్పడే వజ్రాలు (Diamonds) చాలా విలువ కలిగి ఉంటాయి. ఇవి లక్షలాది సంవత్సరాల పాటు భూమి లోతుల్లో అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య రూపుదిద్దుకుంటాయి. అందుకే ఈ రత్నాల విలువ ఆకాశాన్నంటుతుంది. కొన్ని వజ్రాలకు లక్షల్లో నుంచి కోట్ల రూపాయల వరకు ధర పలుకుతుంది. సాధారణంగా వీటి ధర పరిమాణం, రంగు, పారదర్శకత, ఆకారాలపై ఆధారపడి నిర్ణయించబడుతుంది. అలాంటిది ప్రపంచంలో ఓ ప్రాంతంలో వజ్రాలు ఉచితంగా (Free diamonds) లభిస్తాయంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎలాంటి ట్యాక్సులు, ప్రభుత్వ అనుమతులు అవసరం లేకుండానే… మీరు అక్కడ తవ్వి కనుగొన్న వజ్రాన్ని నేరుగా మీ సొంతం చేసుకోవచ్చు. ఇంతటి ఈ అద్భుతమైన అవకాశం అందిస్తున్న ప్రదేశం ఎక్కడుందని ఆలోచిస్తున్నారా? అదే అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలోని 'క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్'.
అర్కాన్సాస్ (Arkansas) రాష్ట్రంలోని మర్‌ఫ్రీబరో గ్రామం సమీపంలో ఉన్న 'క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ (Crater of Diamonds State Park)' అనే ప్రత్యేకమైన పార్కు, ఒకప్పుడు వజ్రాల గనిగా (Diamond mine) ఉపయోగంలో ఉండేది. 1972లో దీనిని స్టేట్ పార్కుగా మార్చారు. అప్పటి నుంచి ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దాదాపు 37.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్కు ప్రత్యేకత ఏంటంటే.. వజ్రాలు ఉచితంగా లభించటమే కాదు, మీరు తవ్వి దొరికిన వజ్రాన్ని ఉచితంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇలా ఇప్పటివరకు ఈ స్థలంలో 35,000కు పైగా వజ్రాలు దొరికాయి. వాటిలో కొన్ని అరుదైన బ్రౌన్, యెల్లో వజ్రాలు కూడా ఉన్నాయి. అలాగే కొంత తక్కువ విలువ కలిగిన అమెథిస్ట్, జాస్పర్, ఎగేట్, క్వార్ట్‌జ్ వంటి రత్నాలు కూడా దొరికాయి.
ఇక, ఇటీవల మిన్నెసోటాకు చెందిన డేవిడ్ డికుక్ అనే వ్యక్తికి ఇక్కడ 3.81 కేరట్ల బ్రౌన్ డైమండ్ దొరికింది. సాధారణంగా మట్టిని జల్లెడతో వడకడుతూ కనిపించిన చాక్లెట్ రంగు మెరిసే రాయిని పరీక్షించగా, అది విలువైన వజ్రంగా తేలింది. అయితే, ఈ పార్కులోకి ప్రవేశించేందుకు పెద్దలకు రోజుకు 15 డాలర్లు (రూ.1285), పిల్లలకు 7 డాలర్లు (రూ.600) చెల్లించాలి. టెంట్ వేసుకుని అక్కడే బస చేస్తూ రోజులు గడుపుతూ తవ్వకాల్లో పాల్గొనవచ్చు. పార్కు బయట టెంట్లు, తవ్వకాల పనిముట్లు అద్దెకు ఇచ్చే దుకాణాలు కూడా అందుబాటులో ఉంటాయి.






