- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video:‘మా ఏరియాకి వస్తారా’.. ఆ గుంపును తరిమికొట్టిన కోతులు.. యుద్ధం మాములుగా లేదుగా!
ప్రస్తుత ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందిందో అందరికీ తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందిందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగిన సోషల్ మీడియా(Social Media)లో చూస్తునే ఉన్నాం. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా చిత్రవిచిత్ర ఘటనలు, షాకింగ్ ఘటనలు నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జంతువులు(Animals), పక్షులు(birds) చేసే వింత చేష్టలు కొందరు నెటిజన్లు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి.
తాజాగా.. కోతుల(Monkey) గుంపునకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మనుషుల మధ్యే కాదు.. మూగజీవుల మధ్య కూడా ప్రాంతీయ ద్వేషాలు ఉంటాయి అన్నట్లుగా ఓ సంఘటన చోటు చేసుకుంది. రెండు కోతుల గ్రూపుల మధ్య పెద్ద యుద్ధమే(Monkey Clans War) జరిగింది. ఓ ఏరియా కోతులన్నీ కలిసి రోడ్డు పక్కన ఓ వైపు మోహరించగా మరో ఏరియాకు చెందిన కోతులన్నీ వాటి పై దాడికి దిగాయి. ఆ వీడియోలో వేరే ప్రాంతానికి చెందిన కోతులు తమ ప్రాంతానికి వచ్చినందుకు భీకర యుద్దమే చేశాయి. అక్కడ జరిగిన భీకర యుద్ధం చూస్తే ఎవరైనా షాక్ అవుతారు.
ఒకటి కాదు రెండు కాదు వందలాది కోతులు ఒకే చోట రెండు వర్గాలుగా ఏర్పడి యుద్ధం(War) చేశాయి. అచ్చం సినిమాల్లో చూపించినట్లు గానే వానరసేనలు గుంపులు గుంపులుగా ఏర్పడి కోట్లాడుకున్నాయి. ఈ క్రమంలో ఒక ప్రాంతం కోతులు మరో ప్రాంతంలోని కోతుల గుంపు పై దాడి చేస్తే అక్కడి కోతులు ఆగ్రహంతో తిరగబడ్డాయి. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న కొందరు ఆ వానర సైన్యాన్ని చూసి వాహనాలు ఆపారు. ఈ తరుణంలో అవి కొట్లాడుకుంటున్నాయని గమనించారు. తమ వాహనాలను ఆపుకొని మరీ కొట్లాటను ఆసక్తిగా తిలకించారు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. కానీ.. నిమిషాల్లో కోతుల కోట్లాటకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా(Viral) మారింది.
వీడియో కోసం ఈ లింక్ https://x.com/AMAZlNGNATURE/status/1913165581735415862 క్లిక్ చేయండి.






