- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIDEO: అదృష్టం అంటే వీడిదే.. రైలు ఢీ కొట్టినా చిన్న గీత కూడా పడలేదు
మద్యం మత్తులో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాగినమైకంలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఘోర ప్రమాదాల్లో చిక్కుకుంటారు. అయితే అలా ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ వ్యక్తి మాత్రం బతికి బయటపడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్: మద్యం మత్తులో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాగినమైకంలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఘోర ప్రమాదాల్లో చిక్కుకుంటారు. అయితే అలా ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ వ్యక్తి మాత్రం బతికి బయటపడ్డాడు. ఈ ఘటన పెరు దేశంలో చోటు చేసుకుంది. ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి రైల్వే ట్రాకుపై తలపెట్టి పడుకున్నాడు. అతడు పడుకున్న సమయంలోనే రైలు రావడంతో వ్యక్తిపై నుండి వెళ్లింది. అయితే చక్రాల కిందనే కొంత దూరం వరకు రైలు అతడిని తోచుకునివెళ్లినా చిన్న గీత కూడా తగల్లేదు.
మిక్సర్ లో పడి తప్పించుకున్న ఆహార ధాన్యాల మాదిరిగా తృటిలో తప్పించుకుని బటయపడ్డాడు. రైలు వెళ్లినంతసేపు ఏం జరుగుతుందో తెలియకపోయినా.. అది వెళ్లిన తరవాత మాత్రం లేచి కూర్చుకున్నాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి వచ్చి అతన్ని పట్టుకుని ఆశ్చర్యపోయాడు. ప్రస్తుం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజన్ ఏ బ్రాండ్ తాగి పడుకున్నావురా అని కామెంట్ చేయగా మరో నెటిజన్, అదృష్టం అంటే వీడిదే... అంటూ కామెంట్ పెట్టాడు. ఏదేమైనా రైలు ప్రమాదానికి గురై కూడా ప్రాణాలతో బయటపడ్డాడు అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనే చెప్పాలి. VIDEO






