- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral:అయ్యో.. పెళ్లి కూతురు ముందు వరుడి పరువు పోయిందిగా! ఏం జరిగిందంటే?
ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం గమనిస్తూనే ఉన్నాం.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం గమనిస్తూనే ఉన్నాం. వరుడు వధువు కలిసి డాన్స్ చేసిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లుకొడుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, మరికొన్ని షాకింగ్‌గా ఉండటంతో వైరల్ అవుతుంటాయి. అలాంటి అసక్తికర వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. సాధారణంగా పెళ్లి కొడుకు ఎంతో హుందాగా, డాబు దర్పంగా కనిపిస్తాడు. వధువు ముందు ఎంతో ధైర్యవంతుడిగా కనిపిస్తాడు. కానీ ఇక్కడ జరిగిన ఓ సంఘటనలో పెళ్లి కొడుకు పిరికి బయట పడిపోయింది. ఈ వీడియో చేసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ పెళ్లి వేడుకలో జరిగిన ఫన్నీ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది. పెళ్లిలో ఎంతో ధైర్యంగా కనిపించే వరుడు ఒక్కసారిగా భయపడుతూ గట్టిగా అరిచాడు. అయితే.. వివాహ వేడుకలో వధువరులు దండలు మార్చుకోవడం తెలిసిందే. అయితే, ఈ పెళ్లి వేడుకలో పెద్దల సమక్షంలో దండలు మార్చుకుంటున్న సమయంలో చిన్నపాటి టపాసు పేలడంతో వరుడు ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డాడు. ఈ దృశ్యం చూసి పెళ్లికి వచ్చిన వారంతా నవ్వుకున్నారు. పక్కనే ఉన్న వధువు మాత్రం ఏ మాత్రం బెదరక పోవడం గమనార్హం. పెళ్లి కూతురు ముందు వరుడికి పరువు పోయిందిగా అంటూ నెటిజన్లు ఈ వీడియో పై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. కానీ, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో హల్‌చల్ చేస్తుంది.






