- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకా లేవరా.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించగా, 33 మంది గాయపడిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించగా, 33 మంది గాయపడిన విషయం తెలిసిందే. జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి 18 ఏళ్ల తర్వాత తమ మొదటి టైటిల్‌ను సాధించింది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఆధ్వర్యంలో బెంగళూరులో విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు.అనుకున్న దానికంటే జనం ఎక్కువ రావడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో మరణించిన ఓ కుర్రాడి తండ్రి అతడిని ఖననం చేసిన ప్రదశంలో పడి కొడుకా లేవరా అంటూ బోరున ఏడవడం చూపరులకు కంటతడి పెట్టించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు. ఇంజనీరింగ్ చదువుతున్న భూమిక్ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నారు. 100 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి భూమిక్ కోసం పెట్టానంటూ కొడుకు సమాధి వద్ద తండ్రి బోరుమంటున్న వీడియో అందరినీ కలిచివేస్తోంది.హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. బెంగళూరులో ఉంటు ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకెళ్లి తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆస్పత్రిలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నిజానికి ఆ పిల్లాడి తండ్రిదే తప్పని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కొడుకు చావుకు భాద్యత మరియు కారణం తండ్రి మాత్రమే. వంద కోట్ల ఆస్తి సంపాదన మీద ఉన్న దృష్టి, కొడుకు పట్ల గానీ కుటుంబం పట్ల గానీ ప్రేమ లేదా ఆప్యాయత గానీ చూయించి ఉంటే …తప్పకుండా కొడుకు తండ్రితో మాట్లాడి విషయం చెప్పి ఉండేవాడు అని ఒక నెటిజన్, తండ్రి దే తప్పు.. పిల్లాడిని చెప్పు చేతల్లో పెట్టాలి కొంత వయసు వచ్చేవరకూ.. ఇంట్లో చెప్పి వెళ్ళాలి కదా..! అంటే దీని అర్థం ఆ అబ్బాయికి పేరెంట్స్ అంటే భయం లేదు. పేరెంట్స్ కూడా అలాగే తయారయ్యారు అని మరో నెటిజన్ కామెంట్స్ చేశారు. అనేకమంది కూడా ఇలాగే కామెంట్స్ చేస్తున్నారు.






