ధోనిపై తెలుగోడి అభిమానం.. ప్రపంచంలో ఇదే అతిపెద్ద గిఫ్ట్.. వీడియో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

by Disha Web Desk 7 |
ధోనిపై తెలుగోడి అభిమానం.. ప్రపంచంలో ఇదే అతిపెద్ద గిఫ్ట్.. వీడియో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అంటే చాలా మందికి ప్రాణం. అందులోను క్రికెటర్స్‌లో ధోనికి ఉన్నంత క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని అంటే CSK.. CSK అంటే ధోని. ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో పదిసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు ధోని. ఇదిలా ఉంటే.. ధోనిపై ఉన్న అభిమానాన్ని అభిమానులు ఏదో ఒక రూపంలో నిరూపించుకుంటూనే ఉంటారు.

ఈ క్రమంలోనే.. తాజాగా ఓ యూట్యూబర్ తన అభిమాన క్రికెటర్‌పై తమకున్న అభిమాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ప్రపంచంలోనే అతిపెద్ద థ్రెడ్ ఆర్ట్‌తో ధోని చిత్రాన్ని రూపొందించారు. ‘తెలుగు ఎక్స్‌పెరిమెంట్స్’ అనే యూట్యూబ్ ఛానెల్ నడిపూ కిరణ్ అనే వ్యక్తి 20-20 అడుగుల సైజ్‌తో ధోని చిత్రాన్ని తన స్నహితుల సహాయంతో చిత్రీకరించారు. ఆ ఆర్ట్ చిత్రీకరించడానికి వాళ్లకు నాలుగు రోజుల సమయం పట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోండి.



Next Story