- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన ఎలక్ట్రిక్ కారు
తమిళనాడులోని ఎలక్ట్రిక్ కారు ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులోని ఎలక్ట్రిక్ కారు ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా అవినాశిలో టాటా హారియర్ ఈవీ కారు 'సమ్మన్ మోడ్' (కీ ఫోబ్ ద్వారా కారును తక్కువ దూరంలో రిమోట్‌గా ముందుకు లేదా వెనక్కు కదిలించే ఫీచర్)లో ఉన్న సమయంలో సడన్ గా వెనక్కి దూసుకు రావడంతో సెంథిల్ అనే 45 ఏళ్ల వ్యక్తి మరణించారు. సెంథిల్ రెండు వారాల క్రితం ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేసి తన దుకాణం వద్ద కారును ర్యాంపుపై పార్క్ చేసి, దానిలో ఎక్కే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది.
సీసీటీవీ ఫుటేజీలో కారు ర్యాంపు నుంచి వెనక్కి రావడం, సెంథిల్ బ్రేక్ వేయడానికి ప్రయత్నించి కిందపడి, తలకు తీవ్ర గాయం కావడం కనిపిస్తుంది. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకుముందు కారులో సాఫ్ట్‌వేర్ సమస్యలు ఎదురై, షోరూమ్ టెక్నీషియన్ల సహాయంతో రీస్టార్ట్ చేయాల్సి వచ్చిందని సెంథిల్ బంధువులు ఆరోపించారు.
ఈ ప్రమాదంపై టాటా మోటార్స్ స్పందిస్తూ.. కారు మోటార్ ఆన్‌లో లేదని, ర్యాంపు వాలుతో గురుత్వాకర్షణ శక్తి వల్ల కారు వెనక్కి వచ్చి రీబౌండ్ అయ్యిందని పేర్కొంది. అవినాశి అధికారులు ఈ ఘటనపై ఇంకా అధికారిక విచారణ వివరాలను విడుదల చేయలేదు. అలాగే కుటుంబం నుంచి ఇప్పటివరకు అధికారిక ఫిర్యాదు పోలీసులకు రాలేదని సమాచారం.






