ఫంక్షన్‌లోకి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చిన ఎద్దు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-16 07:49:37  IST  )

ఫ్యామీలి ఫంక్షన్ అంటే సరదాలు, సంతోషాలు మాములే.

ఫంక్షన్‌లోకి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చిన ఎద్దు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్యామీలి ఫంక్షన్ అంటే సరదాలు, సంతోషాలు మాములే. ఇక ఇటీవల కాలంలో వేడుక చిన్నదైనా, పెద్దదైనా డిజే పాటలతో అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ ఫ్యామిలీ (Family) ఎంతో సంతోషంగా ఫంక్షన్ (Function) జరుపుకుంటుంది. పాటలు పాడేందుకు గాయకులను కూడా నిర్వహించుకున్నారు. ఇక స్టేజీపై సింగర్స్ పాడుతుంటే.. కింద ఉన్న వారంతా ఉత్సాహంగా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఇంతలో ఆ ఫంక్షన్‌లోకి ఓ ఎద్దు (Bull) ప్రవేశించగా, ఇద్దరు యువకులు తాడుతో బంధించి పట్టుకున్నారు.

అయితే, డిజే సౌండ్స్‌కి ఆ ఎద్దుకు చిర్రెత్తుకొచ్చిందేమో ఒక్కసారిగా ఎద్దు విజృంభించింది. అక్కడున్న వారిని తొక్కుకుంటూ స్టేజీపైకి దూసుకెళ్లి వేడుకలో రచ్చ రచ్చ చేసింది. అనంతరం స్టేజీ కిందకు పరుగెత్తుతూ అతిథులను (Guests) భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో అక్క‌డున్న వారంతా ప‌రుగులు తీశారు. చివ‌ర‌కు ఆ ఎద్దును అక్క‌డున్న యువ‌కులు బంధించారు. ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందనే విషయం తెలియలేదు కానీ, ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే ఎద్దు దాడిలో (Bull attack) ప‌లువురు గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

Click For Tweet..

Next Story