Viral news : మొదటి రాత్రే పెళ్లి కూతురు డిజప్పాయింట్..

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-12-16 12:27:15  IST  )

ఎన్నో కలలతో వివాహబంధంలోకి అడుగుపెట్టిన యువతికి శోభనం రోజు రాత్రే జీవితంలో మర్చిపోలేని షాక్ తగిలింది.

Viral news : మొదటి రాత్రే పెళ్లి కూతురు డిజప్పాయింట్..
X

దిశ, వెబ్‌డెస్క్ : యుక్త వయసుకు వచ్చిన యువతీయువకులు పెళ్లిపై ఎన్నో కలలుకంటారు. కాబోయే భర్త ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. అతడితో కలిసి తన కలలను నెరవేర్చుకోవాలి అని ఎన్నో ఊహలతో ఉంటారు. అబ్బాయిలూ అంతే.. తనకు కాబోయే భార్య అందరికంటే అందంగా ఉండాలని, ఆమెతో కలిసి తన జీవత లక్ష్యాలను సాధించాలని కలలు కంటుంటారు. అయితే ఇలా కలలు కంటూ వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి శోభనం రోజు రాత్రే జీవితంలో మర్చిపోలేని షాక్ తగిలింది. రూ.లక్షల కట్నం ఇచ్చి కానుకలు సమర్పించి ఆమె మొదటి రాత్రే నీరుగారిపోయింది. కలల రాకుమారుడు చేసిన చేష్టలకు ఆమె విడాకులు కావాలని కోర్టుకు ఎక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గోరఖ్‌పూర్ ఇండస్ట్రీరియల్ ఏరియాలో ఇంజనీర్‌గా పని చేసే 25 ఏళ్ల యువకుడికి నవంబర్ 28న బేలియాపర్‌కు చెందిన యువతితో వివాహం అయింది. కుటుంబ సభ్యులు ఆ నవజంటకు డిసెంబర్ 1న శోభనం ఏర్పాటు చేశారు. పాల గ్లాసుతో గదిలోకి వెళ్లిన వధువుకు పెళ్లికొడుకు పిడుగులాంటి వార్త చెప్పాడు. తను సంసారానికి పనికిరానని, శృంగారం ఏమాత్రం చేయలేనని తేల్చిచెప్పాడు. అంతేకాదు.. గతంలోనూ తనకు పెళ్లి అయిందని, ఆమెతో కూడా తాను శృంగారం చేయలేకపోవడంతో నెలరోజులకే విడాకులు తీసుకోని వెళ్లిపోయిందని డబుల్ బాంబు పేల్చాడు. తీవ్ర షాక్‌కు గురైన యువతి ఉదయాన్ని తన తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. వెంటనే వాళ్లు వచ్చి కూతురిని తమ ఇంటికి తీసుకెళ్లి వరుడి కుటుంబానికి లీగల్ నోటీసులు పంపించారు.

డిసెంబర్ 3న పోలీసులు వరుడి కుటుంబాన్ని బేలియాపర్‌కు పిలిపించారు. వరుడికి వైద్యపరీక్షలు చేయించారు. దీంతో అతడు శృంగార జీవితానికి పనికిరాడని వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. కొడుకు నపుంసకుడు అని తెలిసినా ఆ విషయాన్ని దాయడమే కాకుండా ఇంతకు ముందే వివాహం చేసి, దానిని కప్పిపెట్టి రెండోసారి పెళ్లి చేయడం నేరమని సీరియస్ అయ్యారు. ఇరుకుటుంబాల సభ్యులు చర్చించి కట్నకానులు ఇవ్వాలని తిరిగి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. పెళ్లికి అయిన రూ.7లక్షలతోపాటు కానుకలు నెలరోజుల్లో తిరిగి వధువు కుటుంబానికి ఇస్తామని పోలీసుల సమక్షంలో యువకుడి కుటుంబం అంగీకరించింది. డిసెంబర్ 10న జరిగిన ఈ వివాదం నేటికీ వైరల్‌ అవుతూనే ఉంది.

Next Story