6 అంతస్తులపై నుంచి దూకేసిన కుర్రాడు.. గూస్ బంప్స్ రావాల్సిందే!

by velandi.Saikiran |

ఆరు ఫ్లోర్ల నుంచి కిందికి దూకేస్తే కచ్చితంగా చనిపోతాడని అందరం అనుకుంటాం. కానీ ఇతగాడు చావలేదు

6 అంతస్తులపై నుంచి దూకేసిన కుర్రాడు.. గూస్ బంప్స్ రావాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో భయానక వీడియోలు అలాగే ఫన్నీ వీడియోలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఒక్క ఫ్లోర్ ఉన్న బిల్డింగ్ పై నుంచి... దూకడం కామనే. కానీ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఏకంగా 6 ఫ్లోర్ల పైనుంచి... కిందికి దూకేశాడు.

అయితే ఆరు ఫ్లోర్ల నుంచి కిందికి దూకేస్తే కచ్చితంగా చనిపోతాడని అందరం అనుకుంటాం. కానీ ఇతగాడు చావలేదు. వ్యూస్ కోసం చేసాడో లేదా... పందెం పెట్టి.. గెలిచేందుకు చేసాడో తెలియదు కానీ.. ఆరు ఫ్లోర్ల పై నుంచి... స్విమ్మింగ్ ఫూల్ లో దూకాడు. అక్కడి నుంచి నేరుగా స్విమ్మింగ్ ఫూల్ లోనే పడిపోయాడు.

ఈ వీడియో చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. ఏంట్రా బాబు అంత దూరం నుంచి ఎలా దూకావ్? నీ గుండె ధైర్యం పెద్దది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్విమ్మింగ్ ఫూల్ లో పడినప్పటికీ.. అంత పైనుంచి దూకడం పెద్ద సాహసమే అని కొనియాడుతున్నారు. ఇలాంటోడు ఒలంపిక్స్ కు వస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. క్లిక్

Next Story