- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: సాహసం సూపర్.. మరీ భద్రతలు మాట ఏమిటి?
నేటితరం యువతకు రొటీన్ జీవితాన్ని పక్కనబెట్టి కొత్త అనుభవాల కోసం ప్రయాణించడం, సాహసాలలో పాల్గొనడం ఫ్యాషన్‌లా మారింది.

దిశ, వెబ్ డెస్క్: నేటితరం యువతకు రొటీన్ జీవితాన్ని పక్కనబెట్టి కొత్త అనుభవాల కోసం ప్రయాణించడం, సాహసాలలో (Adventures) పాల్గొనడం ఫ్యాషన్‌లా మారింది. టెక్కింగ్, బంగీ జంపింగ్, జిప్ లైనింగ్, స్కై డైవింగ్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ పట్ల వారి ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. వారాంతాల్లో విహారయాత్రలకైనా, సెలవుల్లో స్నేహితుల జట్టుతో కలిసి ఇటువంటి సాహసాల్లో పాల్గొని కొత్త అనుభూతులను అనుభవిస్తున్నారు. ఇవి బయటకు థ్రిల్లింగ్, డేర్‌డెవిల్ అనిపించవచ్చు. కానీ ఆ ఉత్సాహం వెనక దాగి ఉన్న సేఫ్టీ లోపాలు (Safety defects), నియంత్రణల లేమి దేశంలో ప్రమాదకరమైన స్థాయికి చేరుతున్నాయి. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని (Himachal Pradesh) మనాలిలో (Manali) జరిగిన ఘటన అందుకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు.
ఓ యువతి మనాలిలో జిప్ లైన్‌లో పాల్గొనగా 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరడం స్థానికులను, పర్యాటకులను కలవరపరిచింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
సాధారణంగా మనదేశంలో ఇటువంటి అడ్వెంచర్ యాక్టివిటీలపై ఎలాంటి కేంద్రీయ నిబంధనలు లేవు. బహుళ సంస్థలు అనుభవం లేని సిబ్బందితో, సరైన భద్రతా పరికరాలు లేకుండానే ఈ రిస్క్ గేమ్స్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రాణాంతక ప్రమాదం జరిగిన తర్వాతే అధికార యంత్రాంగం అలర్ట్ అవుతోంది. సాహసాల్లో పాల్గొనడం తప్పు కాదు. కానీ ఆ సాహసాల్ని నిబద్ధతతో, భద్రతతో అందించడం ప్రతి సంస్థ బాధ్యత. ప్రభుత్వం, పర్యాటక శాఖలు తక్షణం సర్టిఫికేషన్ విధానం, నిబంధనల అమలు, తరచూ తనిఖీలు వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం తీవ్రంగా ఉంది.






