యూపీలో దారుణం.. పదేళ్ల బాలుడికి హార్ట్ ఎటాక్

by Muthe.Rajitha |

రీల్స్ చూడటమే కారణమా?

యూపీలో దారుణం.. పదేళ్ల బాలుడికి హార్ట్ ఎటాక్
X

దిశ, వెబ్ డెస్క్ : నాలుగవ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడు హార్ట్ ఎటాక్ కు గురై మరణించిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆమ్రోహా జిల్లాలోని జుజెలా చక్ గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలుడు మయాంక్ సాయంత్రం ఇంట్లో మంచం మీద కూర్చొని మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ రీల్స్ చూస్తూ ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. వైద్యులు ప్రాథమికంగా హార్ట్ ఎటాక్ కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

అయితే పోస్ట్‌మార్టం చేయించకుండా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించడంతో.. ఇంత చిన్న వయసులో గుండె ఆగిపోవడానికి కారణం ఏమిటో గుర్తించలేకపోయామని పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చిన్న పిల్లలు మొబైల్ ఫోన్‌కు అధికంగా అలవాటు పడటం, ఎక్కువసేపు స్క్రీన్ చూస్తుండటం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story