విమానంలో తెలుగు మెను కార్డ్.. సోషల్ మీడియాలో వైరల్

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-13 05:19:32  IST  )

తరచూ విమానా(Plane)ల్లో ప్రయాణించే వారికి అందులో దొరికి ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

విమానంలో తెలుగు మెను కార్డ్.. సోషల్ మీడియాలో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తరచూ విమానా(Plane)ల్లో ప్రయాణించే వారికి అందులో దొరికి ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక దేశాల వారు, అనేక ప్రాంతాలు ప్రయాణాలు చేస్తుండటంతో అందరికీ అనుకూలంగా ఉండే.. ఆహార పదార్థాలు సమకూరుస్తుంటారు. అయితే.. ఇన్నాళ్లు విమానాల్లో ఇచ్చే మెను కార్డు మాత్రం హిందీ, ఇంగ్లీష్ సహా ఇతర భాషల్లో ఉండేవి.. తాజాగా దుబాయ్‌‌కి చెందిన ఫ్లై ఎమిరేట్ విమాన సంస్థ(Fly Emirates Airline) కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగులో మెను కార్డు(Telugu Menu Card) తీసుకొచ్చింది. ఇందులో మసాలా ఛాయ్, పన్నీర్ పరాఠా సహా అనేక తెలుగు వంటకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మెను కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది గమనించిన నెటిజన్లు.. ‘తెలుగువారు దూరం చేసుకుంటున్న తెలుగును అరబ్‌లు ఆదరిస్తున్నారు’ అని ప్రశంసిస్తున్నారు.




Next Story