ఖండాలు దాటిన ప్రేమ.. లండన్ అమ్మాయిని పెళ్లాడిన తెలంగాణ యువకుడు

by Ajay Maddhiboyina |

ప్రేమ కూడా ఖండాలు దాటిపోతోంది. విదేశాల్లో చదువుకుంటున్నవాళ్లు, ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు అక్కడివారితో ప్రేమలో పడుతున్నారు. అక్కడితో ఆగకుండా కుటుంబాలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటున్నారు.

ఖండాలు దాటిన ప్రేమ.. లండన్ అమ్మాయిని పెళ్లాడిన తెలంగాణ యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ప్రేమైనా పెళ్లైనా సొంత జిల్లాకి చెందిన అబ్బాయి లేదా అమ్మాయితోనే లేదంటే పక్క జిల్లాకు చెందిన వాళ్లతోనే కుదిరేది. కానీ ఆ తరవాత పరిస్థితులు కొంతమారాయి. చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి రావడంతో పక్కరాష్ట్రాల అమ్మాయిలు, అమ్మాయిలు సైతం ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడు చదువులు, ఉద్యోగాల కోసం ఏకంగా ఖండాలు దాటి వెళుతున్నారు. దీంతో ప్రేమ కూడా ఖండాలు దాటిపోతోంది. విదేశాల్లో చదువుకుంటున్నవాళ్లు, ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు అక్కడివారితో ప్రేమలో పడుతున్నారు. అక్కడితో ఆగకుండా కుటుంబాలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఇలాంటి వివాహాలు ఎన్నో జరగ్గా తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాల్లోనూ జరిగింది. ఆదిలాబాద్ పట్టణం కృష్ణ న‌గ‌ర్ కు చెందిన అబ్బాయి భూషిత్తి సాయి ప‌దేళ్ల క్రితం చ‌దువుల కోసం లండ‌న్ కు వెళ్లాడు, చ‌దువు పూర్తి చేసిన త‌ర‌వాత అక్క‌డే సాయి చ‌ర‌ణ్ ఉద్యోగంలో చేరాడు. ఈ క్ర‌మంలో అత‌డికి కార్డిఫ్ కు చెందిన మియా మెహ‌తా అనే యువ‌తితో ప‌రిచయం ఏర్ప‌డింది. ఆ పరిచ‌యం కాస్తా ప్రేమ‌గా మార‌డంతో ఇద్ద‌రూ పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆదిలాబాద్ లోని ఓ ఫంక్ష‌న్ హాల్ లో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఆదివారం వీరి పెళ్లి జ‌రిగింది. ప్ర‌స్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Next Story