- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Techie Viral: దేశవ్యాప్తంగా ఒరాకిల్ బిగ్ లేఆఫ్స్.. ఒడిశా టెక్కీ సేవింగ్స్ ప్లాన్ వైరల్
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) లేఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోయిన ఒడిశా టెక్కీ, తన అద్భుతమైన పొదుపు ప్లాన్‌తో నెలకు రూ.43 వేలు పాసివ్ ఇన్‌కమ్ పొందుతూ వైరల్‌గా మారారు.

దిశ, వెబ్‌డెస్క్: ఒరాకిల్ (Oracle) సంస్థలో లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒడిశాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కథ ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులో పనిచేస్తూ ఒక్కసారిగా ఉద్యోగం పోయినప్పటికీ, అతను ఏమాత్రం ఆందోళన చెందకుండా తన పొదుపుతో స్ఫూర్తి పొందిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఏం చేయకుండానే నెలకు రూ.45 వేలు..
14 ఏళ్ల ఐటీ అనుభవం ఉన్న ఓ టెక్కీ, ఉద్యోగం పోగానే కంగారు పడకుండా తన సొంత ఊరు భువనేశ్వర్‌కు మకాం మార్చేశాడు. ఎటువంటి అప్పులు, ఈఎంఐలు లేకపోవడం, పక్కాగా ప్లాన్ చేసుకున్న పొదుపు మొత్తమే అతడి ధైర్యానికి కారణం. తన తల్లిదండ్రులు, భార్య పేర్లపై ఉన్న జాయింట్ అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున డిపాజిట్ చేశారు. వీటి ద్వారా నెలకు సుమారు రూ.28,000 వడ్డీ వస్తుంది. అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్న రూ.30 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా నెలకు మరో రూ.15,000 ఆదాయం వస్తోంది. అయితే, ఎలాంటి పని చేయకుండానే కేవలం వడ్డీల రూపంలోనే అతనికి నెలకు రూ.43,000 లభిస్తోంది. భువనేశ్వర్ వంటి నగరంలో ఓ కుటుంబం హాయిగా గడపడానికి ఈ మొత్తం సరిపోతుంది.
సరదాగా ఉబెర్ ట్యాక్సీ..
కాగా, ఉద్యోగం లేదని ఖాళీగా కూర్చోకుండా ఒడిశా టెక్కీ తన సమయాన్ని ఏమాత్రం వేస్ట్ చేయడం లేదు. ఖాళీ సమయంలో సరదాగా, యాక్టివ్‌గా ఉండటానికి ఉబెర్ ట్యాక్సీ నడుపుతున్నాడు. తన తల్లిదండ్రుల సహకారంతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. సోకులు, అనవసరపు ఖర్చులకు పోకుండా, ‘ఓల్డ్ స్కూల్’ పద్ధతిలో పొదుపు చేయడం వల్ల కష్టకాలంలో ఎంతటి ప్రశాంతత లభిస్తుందో ఆ ఒడిశా టెక్కీ నిరూపించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో అతడి స్నేహితుడు నాయక్ సత్య షేర్ చేయగా, నెటిజన్లు అతడి ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను ప్రశంసించక ఉండలేకపోతున్నారు.






