హైదరాబాద్‌లో వాటిని మిస్ అవుతున్నాం... టెకీ పోస్ట్ వైరల్!

by Ajay Maddhiboyina |

హైదరాబాద్‌లో వాటిని మిస్ అవుతున్నాం అంటూనే నగరంపై ప్రశంసలు కురిపించిన ఓ టెకీ సోషల్ మీడియా పోస్ట్ లింక్డ్‌ఇన్‌లో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

హైదరాబాద్‌లో వాటిని మిస్ అవుతున్నాం... టెకీ పోస్ట్ వైరల్!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వాటిని మిస్ అవుతున్నాం అంటూనే నగరంపై ప్రశంసలు కురిపించిన ఓ టెకీ సోషల్ మీడియా పోస్ట్ లింక్డ్‌ఇన్‌లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సిద్ధార్థ్ గుప్తా అనే టెకీ రెండేళ్ల నుండి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడట. ఇక హైదరాబాద్‌లో బెంగుళూరులా కూల్ బ్రీజీ వాతావరణం ఉండదని తెలిపాడు. అదే విధంగా పూణేలో మాదిరిగా ట్రెక్కింగ్ ఉండదని, గుర్ గావ్‌లో మాదిరిగా నియాన్ లైట్లతో మెరిసే నైట్ లైఫ్ ఉండదని పేర్కొన్నాడు. కానీ హైదరాబాద్ లో ఏదో మ్యాజిక్ ఉందని తెలిపాడు.

అక్కడ లోకల్ భాష తెలుగు మాట్లాడకపోయినా ఎవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరని పేర్కొన్నాడు. స్థానిక యాస తెలియకపోయినా మిమ్మల్ని సిగ్గుపడేలా చేయరని తెలిపాడు. అంతే కాకుండా సాయం చేసేటప్పుడు హైదబాదీలు గుర్తింపు కోరుకోరని చెప్పాడు. హైదరాబాద్ లో అడుగుపెట్టినప్పుడు మీరు ఎక్కడ నుండి వచ్చారు అని కూడా అడగరు అని తెలిపాడు. ఎక్కడ నుండి వచ్చినా చిరునవ్వుతో స్వాగతిస్తారని తెలిపాడు. అలాగే బిర్యానీ కూడా అక్కడ వెల్ కమ్ చెబుతుందని అన్నాడు.

ఆటో డ్రైవర్‌కు ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ ఎక్కువ సమయం తీసుకున్నా సురక్షితంగా గమ్య స్థానానికి చేరుస్తాడని పేర్కొన్నాడు. అంతే కాకుండా చాయ్ వాలాకు మీ భాష తెలియకపోవచ్చు, కానీ మీరు మాలో ఒకరు అంటూ ఇరానీ చాయ్ కప్పు అందిస్తాడని పేర్కొన్నాడు. అనేక సంస్కృతులు క‌లిసిపోయిన న‌గ‌రంలో ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వం ఇస్తార‌ని రాశాడు. హైద‌రాబాద్‌లో మెట్రో నగరాల మాదిరి సందడి ఉండకపోయినా..నగరానికి హృదయం ఉంటుందని తెలిపారు. దీంతో పాటూ హైదరాబాద్ పై టెకీ ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో టెకీ పోస్టుకు ఇతర నెటిజన్లు సైతం పాజిటివ్ కామెంట్లు పెడుతూ నగరంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story