- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంవర్క్ చేయలేదని 4 ఏళ్ల బాలుడిని చెట్టుకు వేలాడదీసిన టీచర్లు
by Muthe.Rajitha |
నాలుగేళ్ల చిన్నారి అనికూడా చూడకుండా చెట్టుకు వేలాడదీశారు ఓ స్కూల్ టీచర్లు.

X
దిశ, వెబ్ డెస్క్ : నాలుగేళ్ల చిన్నారి అనికూడా చూడకుండా చెట్టుకు వేలాడదీశారు ఓ స్కూల్ టీచర్లు. ఛత్తిస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. హోంవర్క్ చేయలేదని ఇద్దరు టీచర్లు నాలుగేళ్ళ బాలునిపై సైకోల్లా ప్రవర్తించారు. LKG చదువుతున్న ఆ పిల్లాడి షర్టుకు తాడును కట్టి స్కూల్ ఆవరణలో ఉన్న చెట్టుకు వేలాడదీశారు. భయంతో దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నా వదిలేయకుండా పక్కనే నిలబడి నవ్వుతూ రాక్షసానందం పొందారు.
అయితే ఈ ఘటనను స్కూల్ సిబ్బందిలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అవడంతో అధికారులు సీరియస్ అయ్యారు. పిల్లాడిని చెట్టుకు వేలాడదీసిన టీచర్లను సస్పెండ్ చేయడమే కాకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయునికి నోటీసులు జారీ చేశారు. కాగా టీచర్లకు మానవత్వం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.
Next Story






