- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆచార్య.. సిగ్గు సిగ్గు! మద్యం సేవించి విధులకు ఉపాధ్యాయుడు (వీడియో వైరల్)
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారిని ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయులు తప్పటడుగులు వేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారిని ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయులు తప్పటడుగులు వేస్తున్నారు. కొందరు బాలికలను లైంగికంగా వేధిస్తుంటే.. మరికొందరు తప్పతాగి ఎంచక్కా గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఈ పరిణామాలతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా, ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల పరిధిలోని సుకుద్‌పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఆ పాఠశాలలో పనిచేసే టీచర్ విలాస్ ఏకంగా ఒళ్లు తెలియకుండా తాగేసి విధులకు హాజరయ్యాడు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన అతడు తాను కూర్చునే కుర్చీ వెనకాలే నేలపై సోయి లేకుండా పడుకున్నాడు. ఈ చిత్రం చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయుడు విలాస్‌పై క్రమశిక్షణా చర్యల కింద సస్పెన్షన్ వేటు పడింది. అయితే, టీచర్ విలాస్ తాగి పడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి: https://x.com/bigtvtelugu/status/1963413378619371594






