- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టైలర్ "ఫ్యాన్".. ఓవైపు పని మరోవైపు గాలి.. ఐడియా అదుర్స్!
ఓవైపు కుట్టు మిషన్ కుడుతూనే తనకు గాలి వచ్చేలా టైలర్ ఆ మిషన్ హ్యాండిల్ కు ఓ క్లాత్ చుట్టాడు. దానిని గాలి వచ్చే ఫలకల్లా చుట్టడంతో మిషన్ తొక్కినప్పుడల్లా హ్యాండిల్ తిరిగి చల్లటి గాలి అతడి ముఖానికి తాకుతోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలివి ఉంటే ఎలాంటి సమస్యకైనా ఓ పరిష్కారం దొరుకుతుందని అంటారు. ఇంగ్లీష్‌లో అయితే హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చాలా బెటర్ అని అంటారు. అలాంటి స్మార్ట్ వర్క్ చేసి ఓ కుర్రాడు ఇప్పుడు నెటిజన్ల చేత వావ్ అనిపించుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరో.. ఆ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ నెట్టింట మాత్రం అతడి వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అతడి తెలివికి ఫిదా అవుతున్నారు. సాధారణంగా టైలరింగ్ అనేది కష్టపడి చేసే పని. డ్రెస్సులు కుట్టే సమయంలో కష్టపడటం వల్ల చెమటలు పట్టేస్తుంటాయి. ఎండాకాలంలో అయితే ఓవైపు ఉక్కపోత, మరోవైపు పనివల్ల చాలా ఇబ్బందిపడుతుంటారు.
అయితే అలా చెమటపట్టకుంటా ఈ టైలర్ చేసిన ఉపాయం చూస్తే ఆశ్చర్యపోతారు. ఓవైపు కుట్టు మిషన్ కుడుతూనే తనకు గాలి వచ్చేలా టైలర్ ఆ మిషన్ హ్యాండిల్ కు ఓ క్లాత్ చుట్టాడు. దానిని గాలి వచ్చే ఫలకల్లా చుట్టడంతో మిషన్ తొక్కినప్పుడల్లా హ్యాండిల్ తిరిగి చల్లటి గాలి అతడి ముఖానికి తాకుతోంది. దానివల్ల చెమట లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటున్నాడు. ఇక గాలి కోసం ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఫ్యాన్ వల్ల కరెంట్ బిల్ వస్తుంది. కానీ యువకుడి ప్లాన్ తో కరెంట్ పొదుపు చేయడంతో పాటు గాలి కూడా వస్తుంది. ఇక ఈ ఉపాయంతో కరెంట్ పోయినా బెంగలేకుండా పనిచేసుకోవచ్చు.






