నవీన్ జిందాల్ ఇంట్లో పెళ్లి సంబరం! డ్యాన్స్ చేసిన సుప్రియా సూలే, మహువా మోయిత్రా, కంగనా రనౌత్

by Ramesh Naini |

బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ ఇంట్లో పెళ్లి సంబరం అంగరంగా వైభవంగా జరిగింది.

నవీన్ జిందాల్ ఇంట్లో పెళ్లి సంబరం! డ్యాన్స్ చేసిన సుప్రియా సూలే, మహువా మోయిత్రా, కంగనా రనౌత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ ఇంట్లో పెళ్లి సంబరం అంగరంగా వైభవంగా జరిగింది. భారత్ లోని అత్యంత శక్తివంతమైన వ్యాపార కుటుంబాల్లో ఒకటైన జిందాల్ కుమార్తె యశస్విని వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకను ఊహించని విధంగా బాలీవుడ్ సినిమా రేంజ్‌లో నిర్వహించారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో భాగంగా, జిందాల్ కుటుంబానికి చెందిన నలుగురు సోదరులు.. సజ్జన్, రతన్, నవీన్, పృథ్వీరాజ్ జిందాల్ కలిసి ఉల్లాసంగా నృత్యం చేశారు. అంతేకాదు, రాజకీయ రంగంలో పరస్పర ప్రత్యర్థులుగా భావించే బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే వంటి ప్రముఖులు ఒకే వేదికపై 'ఓం శాంతి ఓం' పాటకు స్టెప్పులు వేయడం ఈ పెళ్లి వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. వీడియో ఇదే..

Next Story