- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ వీడియో వైరల్.. ఫుట్‌బాల్‌లో స్టార్ ప్లేయర్లకు పోటీ ఇచ్చేలా కాకి స్కిల్స్!
పక్షుల్లో కాకులకు ప్రత్యేకమైన తెలివితేటలు ఉంటాయి. కానీ మనం తరచుగా వాటిని 'కా.. కా..' అని అరుస్తూ, సాధారణ పక్షిలాగే గమనిస్తుంటాం. అవి ఎక్కడ కనిపించినా పెద్దగా పట్టించుకోం.

దిశ, వెబ్ డెస్క్: పక్షుల్లో కాకులకు ప్రత్యేకమైన తెలివితేటలు ఉంటాయి. కానీ మనం తరచుగా వాటిని 'కా.. కా..' అని అరుస్తూ, సాధారణ పక్షిలాగే గమనిస్తుంటాం. అవి ఎక్కడ కనిపించినా పెద్దగా పట్టించుకోం. అయితే, తాజాగా ఓ కాకి (crow) మాత్రం అందరినీ దృష్టిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అద్భుతమైన ఫుట్‌బాల్ నైపుణ్యాలతో సోషల్ మీడియాలో (Social media) తెగ హల్ చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన వారంతా కాకి చలాకీ తనానికి భలే ముచ్చటపడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే?
తాజాగా దక్షిణ గోవాలో (South goa) ఓ ఇంటి వరండాలో ఓ చిన్న పిల్లాడు బాల్‌తో ఆడుకుంటూ కనిపించాడు. అక్కడి సడెన్‌గా ఓ కాకి ప్రత్యేక్షమైంది. అది చూసిన ఆ పిల్లోడు వెంటనే ఆ బాల్‌ను కాలితో కాకి వైపుకు తన్నాడు. నిజానికి ఆ కాకి అక్కడి నుంచి పారిపోవాలి. కానీ, అది వెళ్లకుండా, తన ముక్కుతో ఆ బాల్‌ను ఆ అబ్బాయి వైపు నెట్టింది. మళ్లీ ఆ అబ్బాయి బాల్‌ను కాకి వైపు తన్నాడు. అలా ఇద్దరూ కాసేపు ఫుట్ బాల్ ఆట ఆడుకున్నారు. ఈ దృశ్యాలను కుటుంబసభ్యులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా, వైరల్‌గా మారింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు 'ఈ కాకి గత జన్మలో ఫుడ్ బాల్ ప్లేయర్ అయి ఉంటుంది' అంటూ కొందరు, 'రొనాల్డో కాదు.. క్రౌనాల్డో' అంటూ మరికొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.






