Viral video: చిన్న పిల్లలపై వీధి కుక్క దాడి.. సూపర్ హీరో రేంజ్‌లో కాపాడిన మరో శునకం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-16 11:46:00  IST  )

వీధి కుక్కల బారి నుంచి ఆ వీధిలో ఆడుకుంటున్న చిన్న పిల్లలను ఓ పెంపుడు కుక్క కాపాడింది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో (Rishikesh) ఈ ఘటన వెలుగుచూసింది.

Viral video: చిన్న పిల్లలపై వీధి కుక్క దాడి.. సూపర్ హీరో రేంజ్‌లో కాపాడిన మరో శునకం
X

దిశ, వెబ్ డెస్క్: కుక్క.. విశ్వాసానికి ప్రతి రూపంగా చెబుతారు. అయితే, ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన వీధి కుక్కల బెడద ఎక్కువగానే ఉంది. ఒక్కప్పుడు గ్రామాలకు రక్షణ ఉండే వీధి కుక్కలే ప్రస్తుత రోజుల్లో రోడ్లపై స్వైర విహారం చేస్తూ మనుషులపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా (Viral) మారింది. వీధి కుక్కల బారి నుంచి ఆ వీధిలో ఆడుకుంటున్న చిన్న పిల్లలను ఓ పెంపుడు కుక్క కాపాడింది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో (Rishikesh) ఈ ఘటన వెలుగుచూసింది.

నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియోలో.. ఓ వీధిలో కొంత మంది చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. అదే వీధిలో ఉన్న ఓ ఇంటి ముందు జర్మన్ షెప్ఫర్డ్ కుక్క (German Shepherd Dog) వారిని గమనిస్తూ కూర్చింది. అయితే, అదే సమయంలో ఒక్కసారిగా ఓ వీధి కుక్క వారి వెంటబడింది. అది చూసిన ఆ జర్మన్ షెప్పర్డ్ సూపర్ హీరో రేంజ్‌లో ఆ ఇంటి పహారీ గోడ పై నుంచి దూకి మరీ ఆ వీధి కుక్కను వెంబడించింది. దీంతో ఆ వీధి కుక్క వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరుగులు లంఘించింది. ఈ దృశ్యాలు ఆ ఇంటి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవ్వగా, సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్‌గా మారాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుక్కపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story