యూపీఎస్సీ క్రాక్ చేసిన కొడుకు.. ఐటెమ్ డ్యాన్స్ షో ఏర్పాటు చేసిన తండ్రి.. ఊరంత రచ్చ రచ్చ.. వీడియో వైరల్

by Sujitha Rachapalli |

నార్మల్‌గా పిల్లలు చదువుల్లో రాణిస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? గుడికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయడమో.. స్వీట్లు పంచడమో.. ఇంటికి బంధువులను పిలిపించి భోజనాలు పెట్టించడమో చేస్తుంటారు.

యూపీఎస్సీ క్రాక్ చేసిన కొడుకు.. ఐటెమ్ డ్యాన్స్ షో ఏర్పాటు చేసిన తండ్రి.. ఊరంత రచ్చ రచ్చ.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : నార్మల్‌గా పిల్లలు చదువుల్లో రాణిస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? గుడికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయడమో.. స్వీట్లు పంచడమో.. ఇంటికి బంధువులను పిలిపించి భోజనాలు పెట్టించడమో చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఫుల్ వెరైటీ పార్టీ ఇచ్చాడు ఆ తండ్రి. తన కొడుకు యూపీఎస్సీ క్రాక్ చేశాడని తెలిసి.. ఏకంగా మొత్తం గ్రామానికి ఐటెమ్ డ్యాన్స్ షో ఏర్పాటు చేశాడు. ఢోల్, డీజే, మిరిమిట్లు గొలిపే లైట్లతో ఆ పల్లెటూరి నిశ్శబ్ద పొలాలను సినిమా సెట్‌లా మార్చేశాడు. కొడుకు ఓ మూల కూర్చుని నా ఊరి నుంచి ట్రాన్స్‌ఫర్ కావచ్చా అని గూగుల్‌లో వెతుకుతుంటే.. ఈ ఐటెమ్ షో చూస్తూ గేదెలు కూడా మేతను చప్పరించడం మరిచిపోయాయి. ఆహ్వానం లేని బంధువులు కూడా హాజరై ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. కొందరైతే ఏకంగా పెళ్లి సంబంధం తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్ల కామెంట్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. హహ.. పక్కా దేశీ ఎనర్జీ అని కామెంట్స్ చేస్తున్నారు. కొడుకు యూపీఎస్సీ క్లియర్ చేశాడా లేక దేశానికి వరల్డ్ కప్ తెచ్చాడా.. ఎందుకు ఇంత పెద్ద పార్టీ అని ప్రశ్నిస్తున్నారు. నేను ఈ దేశం విడిచి వెళ్లిపోయేందుకు ఇది కూడా ఒక రీజన్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మస్త్ మజా ఉంది మావా ఇక్కడ అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

Next Story