- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సమోసమ్ వీడియో.. చూస్తే మీరు కూడా కడుపుబ్బా నవ్వుకుంటారు
స్మార్ట్ ఫోన్ (Smart Phone) లేనివారు చాలా అరుదు ఈరోజుల్లో. ఫస్ట్ క్లాస్ట్ చదివే పిల్లాడి నుంచి పండు ముసలి వరకూ ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. అవి కూడా అంతే చవకగా దొరుకుతున్నాయి అది వేరే విషయమనుకోండి.

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ (Smart Phone) లేనివారు చాలా అరుదు ఈరోజుల్లో. ఫస్ట్ క్లాస్ట్ చదివే పిల్లాడి నుంచి పండు ముసలి వరకూ ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. అవి కూడా అంతే చవకగా దొరుకుతున్నాయి అది వేరే విషయమనుకోండి. ఇన్ స్టాగ్రామ్ (Instagram), యూట్యూబ్ (Youtube), ఫేస్ బుక్ (Facebook), ఎక్స్ (X) వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఏదైనా ఫన్నీ వీడియో కనిపిస్తే చాలు. నెటిజన్లు దానిని వైరల్ చేసేంతవరకూ నిద్రపోరంటే అతిశయోక్తి కాదు. కొన్ని రీల్స్ గుడ్ కంటెంట్ ను బట్టి కూడా వైరల్ అవుతుంటాయి.
రెండ్రోజులుగా ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ లలో సమోసమ్.. పేరుతో ఒక వీడియో వైరల్ (Samosam viral Video) అవుతుంది. అది చూస్తే.. ఎవరికైనా తమ చిన్నతనం గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఐస్ క్రీమ్, సమోసాలు అమ్మేవాళ్లు వస్తే.. ఇంట్లో అమ్మ, నాన్నలను డబ్బులడిగి తీసుకుని బయటికి వెళ్లే సరికి వాడు కాస్తా వెళ్లిపోయేవాడు. ఈ వీడియోలో పిల్లలు లేకపోయినా ఇద్దరు అబ్బాయిలు సమోసా పిలుపు వినగానే బయటికి వస్తారు. ఆ అమ్మేవాడు స్కూటీ మీద సమోస అనుకుంటూ తుర్రున వెళ్లిపోతాడు. రెండుసార్లు ఇలాగే జరిగే సరికి మూడోసారి రోడ్డుకి అడ్డంగా కూర్చుంటాడో యువకుడు. ఏంటని అడిగితే ఎక్కడ వెళ్లిపోతావో అని స్నానానికి వెళ్లేవాడిని కాస్తా స.. అని వినిపించగానే వచ్చానంటాడు. వాడితో ముచ్చట్లు పెట్టి వ్యాపారం ఎట్టా ఉందేంటి అని అడిగితే పెద్దగా సాగట్లేదంటాడు.
బండిమీద 100 స్పీడుతో అమ్మితే ఎలా సాగుద్ది.. నడిచి వెళ్లి అమ్ముకోమంటే.. ఆ సమోసాలమ్మే యువకుడు నెత్తిపై సమోసాల పెట్టె పెట్టుకుని తుర్రున పరిగెడతాడు. వాడికి బండి ఉన్నా, నడిచి అమ్మినా ఒకటేనని ఇద్దరు యువకులు ఒకరి మొహం ఒకరు చూస్కుంటారు. ఈ రీల్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వుకున్నాం బ్రో.. అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ సమోసమ్ వీడియో మీరు చూశారా? చూడకపోతే ఇక్కడ కింద లింక్ పై క్లిక్ చేసి ఓ లుక్కేసి మీరు కూడా నవ్వుకోండి మరి.






