అమ్మాయి పిలిచిందని రెస్టారెంట్లకు వెళుతున్నారా? జాగ్రత్త!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-25 14:12:54  IST  )

డబ్బులు దోచుకునేందుకు రెస్టారెంట్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నాయి. సాధారణంగా రెస్టారెంట్‌లకు వెళ్లి భోజనం చేసేవారిలో ఎక్కువగా కపుల్స్ ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే.

అమ్మాయి పిలిచిందని రెస్టారెంట్లకు వెళుతున్నారా? జాగ్రత్త!
X

దిశ‌, వెబ్ డెస్క్: డబ్బులు దోచుకునేందుకు రెస్టారెంట్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నాయి. సాధారణంగా రెస్టారెంట్‌లకు వెళ్లి భోజనం చేసేవారిలో ఎక్కువగా కపుల్స్ ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామీలు కూడా రెస్టారెంట్ల‌కు వెలుతుంటాయి కానీ ఏదో పండ‌గ వ‌చ్చిన‌ప్పుడో.. పుట్టిన‌రోజులు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే. అదే కపుల్స్ అయితే తినడం కోస‌మే కాదు క‌బుర్లు చెప్పుకునేందుకు వెళ్ల‌డానికి మొద‌టి ఆప్ష‌న్ రెస్టారెంట్లే. అయితే ఇప్పుడు దీనినే క్యాష్ చేసుకోవాల‌ని చూస్తూ మోసాల‌కు పాల్ప‌డుతున్నాయి. దీనికి సంబంధించి ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్ట‌డంతో ఈ మోసం వెలుగులోకి వ‌చ్చింది.

కొన్ని రెస్టారెంట్లు కాలేజీ అమ్మాయిల‌ను నియ‌మించుకుని వారితో టెండ‌ర్ లాంటి డేటింగ్ యాప్స్ లో ప్రొఫైల్స్ క్రియేట్ చేపిస్తున్నాయ‌ట‌. అందులో ఆ అమ్మాయిలు కాస్త రిచ్ పార్టీలుగా క‌నిపించే అబ్బాయిల‌ను చూసి గాళం విస‌రాలి. త‌ర‌వాత అమ్మాయి క‌లుద్దామ‌ని చెప్పి, ఫ‌లానా రెస్టారెంట్‌కు డేట్‌కు ఆహ్వానిస్తుంది. ఇక వచ్చిన తరవాత అబ్బాయితో ఖరీదైన ఐటమ్స్ తెప్పించి చివరికి బిల్ కట్టించాలి. అలా కట్టిన బిల్లులో 20 శాతం అమ్మాయిలకు ఇస్తున్నారట.

బిల్ కట్టి అక్కడ నుండి వెళ్లిపోయిన తరవాత అమ్మాయి మళ్లీ అబ్బాయి ముఖం కూడా చూడదు. ఇంకేముంది తరవాత మరో అబ్బాయికి గాళం వేసి బిల్లు కట్టించడమే. అంతే కాకుండా ఫుడ్ ధరలు కూడా పెంచి బిల్ వేస్తున్నారట. అడిగితే గొడవపెట్టుకుని మరీ అబ్బాయిల చేత రెస్టారెంట్ సిబ్బంది బిల్ కట్టించడం ఆశ్చర్యకరం. ఈ ఇష్యూను నలిని ఉనాగర్ అనే నెటిజన్ పోస్ట్ చేయగా రెండు బిల్లులను కూడా పోస్ట్ చేశారు. ఒక బిల్ లో 48వేలు అయితే, మరో బిల్‌లో 75వేల వరకు అయ్యింది.

Read More..

ప్రిన్సెస్ డయానాతో లైంగిక నేరస్థుడు డేటింగ్ ? ట్రంప్ కూడా పోటీ పడ్డారా? సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న న్యూస్..

Next Story