- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : సైనికుడి వెడ్డింగ్ కార్డుపై ఆపరేషన్ సిందూర్.. ఇంత గొప్ప వివాహ పత్రికను చూసుండరు.. గర్వంగా ఉందంటున్న నెటిజన్లు
ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాక్‌కు చుక్కలు చూపించింది. పహెల్గాం దాడికి నిరసనగా ఈ ఆపరేషన్‌ను చేపట్టిన ఇండియా.. భారత్ మారిపోయిందని, తమ జోలికి వస్తే ఎలా

దిశ, ఫీచర్స్ : ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాక్‌కు చుక్కలు చూపించింది. పహెల్గాం దాడికి నిరసనగా ఈ ఆపరేషన్‌ను చేపట్టిన ఇండియా.. భారత్ మారిపోయిందని, తమ జోలికి వస్తే ఎలా ఉంటుందో శత్రుదేశానికి రుచి చూపించింది. కాగా ఈ సమయంలో సేవలు అందించిన సైనికుడి వివాహ పత్రిక కూడా ఆపరేషన్ సిందూర్ పేరుతో ఫీచర్ చేయబడగా.. ఇంత గొప్ప వివాహ పత్రికను చూసుండరని రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.
అమిత్ సింగ్.. రాజస్థాన్‌లోని సికర్‌కు చెందిన సైనికుడు. కాగా తన వివాహ ఆహ్వాన పత్రికలో ఆపరేషన్ సిందూర్‌కు నివాళి అర్పించినందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఏప్రిల్ 22న పహెల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన సంఘటనకు ప్రతిస్పందనగా.. మే 7న భారతదేశం ఈ సైనిక చర్యను ప్రారంభించింది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆహ్వాన పత్రికలో ఇలా రాసి ఉంది... “మా బలం, మా గర్వం — ఆపరేషన్ సిందూర్ యోధులు తమ సోదరుడి వివాహానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నారు” అని ముద్రించారు. ఈ వెడ్డింగ్ కార్డ్ షెఖావత్ కుటుంబ దేశభక్తి, గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరు.. సైనిక సేవను అందించడంలోనూ ముందున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ ముగ్గురు కుమారులు భారత-పాకిస్తాన్ సరిహద్దులో సేవలు అందించారు. మొత్తానికి మే 28న జరగనున్న ఈ వివాహం జాతీయ గర్వానికి చిహ్నంగా మారింది. వ్యక్తిగత వేడుక, భారత సైన్య వీరత్వానికి నివాళిగా ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతోంది.






