- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊర్లో మేకలతో వీడియోలు చేస్తూ.. ఏకంగా ఫార్చ్యూనర్ కొనుగోలు చేశాడు! నెట్టింట వైరల్‌గా సోలాపూర్ యువకుడు
కష్టపడాలనే తపన, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు అని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: కష్టపడాలనే తపన, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు అని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. నేటి ఆధునిక యుగంలో, యువత తమ కలలను నిజం చేసుకోవడానికి సోషల్ మీడియా ఒక శక్తివంతమైన వేదికగా మారింది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే, ఎవరైనా సరే అద్భుతాలు సృష్టించవచ్చు. ఓ గ్రామీణ యువకుడు తాజాగా ఇదే సత్యాన్ని నిరూపించాడు. తన గ్రామంలో చిన్న హోటల్ (Hotel) నడుపుతూ గ్రామీణ జీవన శైలిలో వీడియోలు తీస్తూ ఫేమ్ సంపాదించుకుని లగ్జరీ కారు కొనుగోలు చేస్తే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) ఈ యువకుడి గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. మరీ ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సోలాపూర్‌లోని (Solapur) తుల్జాపూర్-ధరాశివ్ రోడ్డుపై మహద్ గ్రామంలో ఓ యువకుడు భాగ్యశ్రీ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా తన హోటల్ విషయాలతో పాటు తమ సరళమైన గ్రామీణ జీవన శైలి, తమ మేకలకు ఆహారం పెట్టడం, గ్రామీణ వాతావరణంలో రోజువారీ కార్యకలాపాలను చిత్రీకరించడం వంటి వీడియోలు తీస్తూ నెటిజన్లు ఆకట్టుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో అతడి వీడియోలు వైరల్‌గా మారి తన హోటల్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో మంచి ఆదాయం కూడా రావటం మొదలైంది. కట్ చేస్తే.. తాజాగా తన పుట్టినరోజు రోజు సందర్భంగా తన కష్టార్జిత డబ్బులతో రూ.40 లక్షల విలువైన టొయోటా ఫార్చ్యూనర్ SUV కారును కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఇది చూసిన నెటిజన్లు అతడికి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఈ యువకుడి విజయ గాథ కష్టపడి పనిచేయడం, సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఎలాంటి ఉన్నత శిఖరాలు అందుకోవచ్చో నిరూపిస్తోంది. రోడ్డు పక్కన చిన్న హోటల్ నుంచి లగ్జరీ SUV యజమానిగా మారిన అతని ప్రయాణం గ్రామీణ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.






