- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: పాములు పట్టేవాడు పాము కాటుకే చచ్చాడు
తెలుగులో పాములు పట్టేవాడు పాము కాటుకే చచ్చాడు అనే ఓ సామెత ఉంది. అప్పుడు ఆ వీడియో నిజం అని చెప్పేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఎక్కడైనా పాము కనిపించిన వెంటనే పాములు పట్టేవాళ్లకు సమాచారం ఇస్తారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగులో పాములు పట్టేవాడు పాము కాటుకే చచ్చాడు అనే ఓ సామెత ఉంది. అప్పుడు ఆ వీడియో నిజం అని చెప్పేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఎక్కడైనా పాము కనిపించిన వెంటనే పాములు పట్టేవాళ్లకు సమాచారం ఇస్తారు. వాళ్లు వచ్చి ఆ పామును చాకచక్యంగా పట్టుకుంటారు. నిజానికి అలా పట్టుకునేవాళ్లు ట్రైనింగ్ తీసుకుని ఉన్న స్నేక్ క్యాచర్స్ అయితే సమస్య లేదు. వాళ్లకు ముందుగానే ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలేస్తారు. కానీ చాలా మంది ఎలాంటి ట్రైనింగ్ లేకపోయినా గ్రామాల్లో పాములు పడుతుంటారు. లా పట్టుకునేటప్పుడు ప్రమాదవశాత్తు అవి కుట్టడం వల్ల చికిత్స తీసుకోవడమో మరణించడమో జరుగుతుంది. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో కానీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పాములు పట్టే వ్యక్తి ఓ భారీ నాగుపామును పట్టుకున్నాడు. పట్టిన తరవాత దాన్ని జాగ్రత్తగా తీసుకువెల్లి వదిలేయకుండా అందరి ముందు షో చేశాడు. పట్టిన పాముతో బయటకు వచ్చి జనాల ముందు దానిని ఆడించాడు. చాలా సేపు దానిని ఇబ్బంది పెట్టాడు. ఎక్కడకు కదలనివ్వకుండా పట్టుకుని పాము పడగ ముందు చేతులు పెడుతూ అందరూ చూస్తుంటే హీరోలా రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఆ పాము అతడి చేతిని కుట్టేసింది. అయినప్పటికీ వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా చేతికి చిన్నకట్టుకుని మళ్లీ పామును పట్టుకుని డబ్బాలో వేసే ప్రయత్నం చేశాడు. కానీ మెల్లిమెల్లి విషం శరీరంలో వ్యాపించి చివరికి కిందపడిపోయాడు. చూస్తున్నవాళ్లు కూడా ఎవరూ వెంటనే ఆస్పత్రికి తీసుకునివెళ్లకపోవడంతో అక్కడే స్పృహ తప్పిపడిపోయాడు. వీడియో వైరల్ అవ్వడంతో పాములు పట్టేవాడు పాముకాటుకే పోయాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.






