- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shocking: వరుడి స్నేహితులు చేసిన పనికి పెటాకులైన పెళ్లి
వివాహ వేడుకలో (wedding ceremony) వరుడి స్నేహితులు చేసిన పనికి పెళ్లి పెటాకులు (Wedding Cancel) అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్: వివాహ వేడుకలో (wedding ceremony) వరుడి స్నేహితులు చేసిన పనికి పెళ్లి పెటాకులు (Wedding Cancel) అయ్యింది. వివాహ వేదిక వద్ద వరుడు డ్యాన్స్(Dance) చేసినందుకు వధువు తండ్రి పెళ్లి రద్దు చేసిన షాకింగ్ ఘటన న్యూఢిల్లీ (New Delhi)లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా (social media)లో చక్కర్లు కొడుతోంది. ఘటన ప్రకారం న్యూఢిల్లీలోని ఓ వివాహ వేడుక జరుగుతుండగా.. వరుడు వేదిక వద్దకు వచ్చాడు. ఆ సమయంలో పెళ్లి కొడుకుని డ్యాన్స్ వేయాలని అతని స్నేహితులు, సన్నిహితులు బలవంత పెట్టారు. దీంతో ఫేమస్ బాలీవుడ్ సాంగ్ (famous Bollywood song) చోలీ కే పీచే క్యా హై (Choli Ke Peeche Kya Hai) సాంగ్ ప్లే అవుతుండంతో వరుడు ఆనందంతో స్నేహితులతో కలిసి స్టెప్పులు వేశాడు.
వరుడితో పాటు అతని బంధువులు, అతిథులు కూడా అడుగు కలిపారు. అందరూ ఆనందంలో ఉన్న సమయంలో వరుడి డ్యాన్స్ చూసిన వధువు తండ్రి (bride's father) కోపోద్రిక్తుడైనాడు. వరుడి చర్యలు బాగాలేవని చెప్పి, పెళ్లిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు. వరుడి చర్యలు తమ కుటుంబ గౌరవాన్ని కించపరిచాయని వధువు తండ్రి వాపోయాడు. కుటుంబసభ్యులు, సన్నిహితులు సర్థి చెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నాడు. దీంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. అంతేగాక చివరిలో వరుడి కుటుంబానికి, వధువు కుటుంబానికి మధ్య ఇకపై ఎటువంటి సంబంధాలు ఉండకూడదని ఆంక్షలు విధించాడు.
దీంతో అతిథులకు ఆనందం కోసం చేసిన పని వధూవరులకు విషాదాంతంగా ముగిసింది. నెట్టింట వైరల్ గా మారిన ఈ వార్తపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కాగా ఇలాంటి వింత ఘటనలు గతంలో కొన్ని వైరల్ గా మారాయి. గత ఏడాది డిసెంబర్ లో ఉత్తరప్రదేశ్ లోని చందౌలీలో ఓ వరుడు ఆహారం అందించడంలో జాప్యం చేసినందుకు పెళ్లి రద్దు చేసుకున్నాడు. అంతేగాక అదే రోజు తన బంధువును వివాహం చేసుకున్నాడు. దీంతో వధువు కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లకు 7 లక్షల ఖర్చు అయ్యిందని, తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.






