కూలిపోతున్న విమానం.. షాకింగ్ విజువల్స్

by Disha Web Desk 3 |
కూలిపోతున్న విమానం.. షాకింగ్ విజువల్స్
X

దిశ వెబ్ డెస్క్: టైం బాగా లేకపోతే తాడే పామై కరుస్తుంది.. అదే టైం బాగుంటే.. ఈ భూమి మీద నూకలు ఉంటె మృత్యువు చివరి అంచుకు వెళ్లిన బ్రతికి బట్టకడతాం అనేది పెద్దల మాట. ప్రస్తుతం ఆ మాటే నిజమైంది. వందల అడుగుల ఎంతులో ఓ విమానం ప్రయాణిస్తోంది. మరి కాసేపట్లో ఎవరి గమ్యాలకు వాళ్ళు చేరుకుంటాం అని అందులోని ప్రయాణికులు ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు.

అయితే ఎవరు ఊహించని రీతిలో ఆ విమానానికి ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు గాల్లో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా కూలిపోసాగింది. ఇక అందులోని ప్రయాణికులందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో ప్రయాణికులు ప్రదర్శించిన సమయస్ఫూర్తి వాళ్ళ ప్రాణాలను కాపాడింది.

విమానం కూలిపోతున్న సమయంలో అందులోని ప్రయాణికులు పారాచూట్ల సహాయంతో కిందకి దిగి పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. అయితే ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలియదు. కానీ ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ విజువల్స్ మీరు ఒకసారి చూసేయండి.



Next Story