- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో జాగ్రత్త.. చెట్ల పై చిలుక కొట్టిన పండ్లను తింటున్నారా?.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!(షాకింగ్ వీడియో)
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం గమనిస్తూనే ఉన్నాం.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం గమనిస్తూనే ఉన్నాం. నిత్యం వింతలు, విశేషాలకు సంబంధించిన ఘటనలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన కొందరు నెటిజన్లు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇక సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. పాములంటే భయం ఉన్న మొబైల్, టీవీలల్లో చాలా మంది పాములకు సంబంధించిన వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఇక, స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకునే క్రమంలో తీసిన వీడియోలు ఎక్కువగా చూస్తుంటారు. కొందరైతే పాములు కప్పలు వేటాడడం చూసి షాక్ అవుతారు. ఇదిలా ఉంటే.. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఓ పాముకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకారం.. ఒక పాము మామిడి చెట్టు ఎక్కి మామిడి పండును తినాలని భావించింది. ఇక ఆలస్యం చేయకుండా ఆ చెట్టు పై ఉన్న మామిడి పండును కొరికేసింది. దీంతో ఆ పండులో నుంచి వస్తున్న రసం పీలుస్తుంది. పాములను సాధారణంగా మాంసాహారులుగా పరిగణిస్తారు. ఈ క్రమంలో పాము మామిడి పండును తినే దృశ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిందని చెబుతున్నారు. వేడి మరియు నీరు లేకపోవడం వల్ల పాములలో ఇటువంటి ప్రవర్తన కనిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
అయితే.. చాలా మంది చెట్లపై పండిన పండ్లను ఏదో కొరికినట్లు కనిపిస్తే.. అదేదో చిలక కొట్టిన పండు భలే తియ్యగా ఉంటుందని తింటుంటారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూశాక.. అది పాము కొట్టిన పండు కూడా కావచ్చు అని పలువురు భావిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ పండు తింటే ఊహించుకోవడానికి భయంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.






