- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ వీడియో వైరల్.. లైవ్‌లో కాల్పులు.. ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి
సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపాడు. ఇదంతా లైవ్‌లో రికార్డు అవ్వటంతో ఆ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్లితే.. మెక్సికోకు (Mexico) చెందిన 23 ఏళ్ల వలేరియా మార్క్వెజ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా (Mexican Influencer Valeria Marquez) ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఆమె గ్వాడలజారా నగరంలోని బ్యూటీ సెలూన్‌లో టిక్ టాక్‌లో (Tik tok) తన ఫాలోవర్స్‌తో మాట్లాడేందుకు లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించింది.
వలేరియా లైవ్ ప్రారంభించి అందరికీ హాయ్ అని చెప్పింది. ఇంతలో ఆమె శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. ఛాతీ, తలపైకి బుల్లెట్ తగలటంతో లైవ్‌స్ట్రీమింగ్ జరుగుతుండగానే వలేరియా ఒక పక్కకు ఒరిగిపోయి మరణించింది. లైవ్‌లో ఇది చూసి ఆమె ఫాలోవర్స్ షాక్ అయ్యారు. వలేరియాకు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, నిందితుడు వలేరియాకు గిఫ్ట్ ఇచ్చేందుకు వచ్చానని చెప్పి హత్యకు పాల్పడినట్లు మెక్సికో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.






