దసరా పండుగ రోజు షాకింగ్ ఘటన.. కాళ్లకు బూట్లతో అమ్మవారి సన్నిధికి తహసీల్దార్.. చివరికి!?(వీడియో)

by Jakkula.Mamatha |

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

దసరా పండుగ రోజు షాకింగ్ ఘటన.. కాళ్లకు బూట్లతో అమ్మవారి సన్నిధికి తహసీల్దార్.. చివరికి!?(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దసరా ఉత్సవాలు ప్రతీ ఏటా ప్రత్యేకంగా నిలుస్తాయి. పండుగ రోజు సాయంత్రం ఊరి ప్రజలంతా ఏకమై రావణ దహనం చేస్తారు. అనంతరం ఆడపడుచులు బతుకమ్మ, దాండియా ఆటలతో అలరిస్తారు. దసరా రోజే కాకుండా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపాల వద్ద వారం పాటు మహిళలు దాండియా, బతుకమ్మ ఆడుతారు. అయితే, నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న దుర్గామాత చివరి రోజు ఊరేగింపు చేసి నిమజ్జనం చేస్తారనే విషయం తెలిసిందే. ఇక, దసరా సందర్భంగా చాలా చోట్ల దుర్గామాత నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొన్ని చోట్ల ఇప్పటికీ దుర్గామాత నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. నవరాత్రులు దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జనం చేస్తారు.

ఇదిలా ఉంటే.. దసరా ఉత్సవాల్లో రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో జరిగిన దసరా ఉత్సవాల్లో(Dussehra festival) హరిసింగ్ యాదవ్ అనే తహసీల్దార్(Tahsildar) బూట్లూ ధరించి అమ్మవారి సన్నిధిలోకి వెళ్లారు. దీంతో భక్తులు(Devotees) ఒక్కసారిగా ఆగ్రహనికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన పై దాడి చేశారు. అతని బట్టలు చింపి మరీ అక్కడి నుంచి తరిమికొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారింది.Video

Next Story