- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIDEO: చెత్త సర్వీస్.. షోరూమ్ ముందే ఆటోను తగలబెట్టేశాడు
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ ఆటో డ్రైవర్ ఎలక్ట్రానిక్ ఆటో తరచూ రిపేర్ అవ్వడం, షోరూమ్ వాళ్లు పట్టించుకోకపోవడంతో అదే షోరూమ్ ముందు పెట్రోల్ పోసి తగలబెట్టాడు.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని వినియోగదారులను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ రాయితీలు కూడా ప్రకటిస్తోంది. అయితే తరచూ ఎలక్ట్రిక్ వాహనాలు రిపేర్ కావడం కస్టమర్లను ఆందోళనకు గురి చేస్తోంది. అంతే కాకుండా రిపేర్ వచ్చినప్పుడు షోరూమ్‌లు సరిగ్గా సర్వీస్ కూడా ఇవ్వడంలేదని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఏకంగా తమ వాహనాలను సైతం తగలబెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఒకటి రెండు కాదు అనేకం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ పెట్రోల్, డీజిల్ కంటే ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేస్తే ఎక్కువ లాభం వస్తుందని అనుకున్నాడు. అంతే కాకుండా డిస్కౌంట్ కూడా వస్తుందని ఆశించాడు. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్ ఆటో కొనుగోలు చేశాడు. అయితే అది తరచూ రిపేర్ అవ్వడం షోరూమ్ వాళ్లు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటోను తీసుకువెళ్లి అదే షోరూమ్ ముందు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం సదరు షోరూమ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






