రన్నింగ్ ట్రైన్ లో సెల్ఫీలు...కర్రతో కొట్టి, తిక్క కుదిర్చాడుగా!

by velandi.Saikiran |

వ్యక్తి కర్రతో.. ట్రైన్ లో ఉన్న వ్యక్తి చేతి పై గట్టిగా కొట్టాడు. దీంతో ఆ మొబైల్ కింద పడింది.

రన్నింగ్ ట్రైన్ లో సెల్ఫీలు...కర్రతో కొట్టి, తిక్క కుదిర్చాడుగా!
X

దిశ, వెబ్ డెస్క్ : సెల్ఫీల పిచ్చి విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా.. ఏ కార్యక్రమంలో అయినా... ఈ సెల్ఫీ పిచ్చి ఉన్న వాళ్లు కచ్చితంగా మన కంటపడతారు. సెల్ఫీల కోసం ఎలాంటి త్యాగాలైనా చేస్తారు. రోడ్లపై, బిల్డింగ్ లోపల, వాహనాలపై, ఈ మధ్యకాలంలో రన్నింగ్ ట్రైన్లలో సాహసాలు చేస్తూ... సెల్ఫీలు దిగుతున్నారు.

సెల్ఫీలు దిగడమే కాకుండా... సాహసాలు చేస్తూ వీడియోలు కూడా చేసి.. రీల్స్ పెడుతున్నారు. అయితే అచ్చం ఇలాగే రన్నింగ్ ట్రైన్ లో చేయాలని ఓ కుర్రాడు ఆశపడ్డాడు. కానీ అతని సెల్ఫీ పిచ్చి.. కొంపముంచింది. రన్నింగ్ ట్రైన్ లో... సెల్ఫీ దిగుదామని.. తన లెఫ్ట్ హ్యాండ్ తో... ఫోన్ బయటపెట్టి కూర్చున్నాడు. సరదాగా కొన్ని ఫోటోలు దిగాడు.

అయితే... కింద ఉన్న ఒక వ్యక్తి కర్రతో.. ట్రైన్ లో ఉన్న వ్యక్తి చేతి పై గట్టిగా కొట్టాడు. దీంతో ఆ మొబైల్ కింద పడింది. అతని చేతికి కూడా గాయమైంది. అప్పటికే ట్రైన్ ఆ ఊరు దాటిపోయింది. దింతో ట్రైన్ లో ఉన్న వ్యక్తి నిరాశ చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్... రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ట్రైన్ లో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. సెల్ఫీల కోసం.. రన్నింగ్ ట్రైన్ లో ఇలా చేసే వాళ్లకు... తగిన శాస్తి జరగాల్సిందే అని.. పేర్కొంటున్నారు నెటిజెన్స్. క్లిక్

Next Story