- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవే పై భారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఏనుగు.. చివరికి ఏం చేసిందో చూడండి!(వీడియో)
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం గమనిస్తూనే ఉన్నాం.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటం గమనిస్తూనే ఉన్నాం. నిత్యం వింతలు, విశేషాలకు సంబంధించిన ఘటనలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన కొందరు నెటిజన్లు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఏనుగుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం పాఠశాల సెలవుల కారణంగా.. చాలా మంది కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్‌ను సందర్శించడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో హరిద్వార్ హైవేపై వేలాది వాహనాలతో భారీగా రద్దీ నెలకొంటుంది. దీని కారణంగా నగరంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సమయంలో, హరిద్వార్‌లోని శ్యామ్‌పూర్‌లో ఒక అడవి ఏనుగు హైవే ట్రాఫిక్ మధ్యలో చిక్కుకున్న ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వాహనాల మధ్య నుంచి ఏనుగు బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నించింది.
వైరల్ వీడియో(Viral Video) ప్రకారం.. ట్రాఫిక్ జామ్‌లో అకస్మాత్తుగా ఓ అడవి ఏనుగు వచ్చింది. దీంతో హైవే పై తమ వాహనాల్లో ఉన్న ప్రయాణికుల్లో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో కారులో కూర్చున్న వ్యక్తులు భయాందోళనలకు(Panic) గురయ్యారు. ఏనుగు అటుగా వెళ్ళినప్పుడు కారులో కూర్చున్న వ్యక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగు ఆ ట్రాఫిక్ నుంచి బయటపడటానికి మార్గం వెతుకుతూ అక్కడక్కడ తిరుగుతూ ఉంది.
ఈ తరుణంలో ప్రజలు హారన్ సౌండ్ చేయడంతో ఏనుగు భయపడిపోయింది. అనంతరం అక్కడ ఉన్నవారు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ బృందం.. ఏనుగును సురక్షితంగా ట్రాఫిక్ నుంచి బయటకు పంపించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. కానీ.. ఏనుగు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడం అందరినీ ఆశ్చర్యనికీ గురిచేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.






