చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు.. మానవత్వం చాటుకున్న సేల్స్ మ్యాన్ (VIDEO)

by Naga Rani Yarlagadda |

యాంత్రిక లోకంలో, రీల్స్ మోజులో పక్కన మనిషి ఏమైపోయినా పట్టించుకోని మన మధ్య సందర్భానుసారం మానవత్వాన్ని చాటే కొందరు ఉండటం అభినందించాల్సిన విషయం.

చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు.. మానవత్వం చాటుకున్న సేల్స్ మ్యాన్ (VIDEO)
X

దిశ, వెబ్‌డెస్క్: యాంత్రిక లోకంలో, రీల్స్ మోజులో పక్కన మనిషి ఏమైపోయినా పట్టించుకోని మన మధ్య సందర్భానుసారం మానవత్వాన్ని చాటే కొందరు ఉండటం అభినందించాల్సిన విషయం. ఉండటానికి ఇల్లు, మూడు పూటలు తినడానికి సరైన తిండి లేక.. రోడ్డు పక్క ఆడుకుంటూ కనిపించే పిల్లల్ని చూస్తే కొందర ఛీదరించుకుంటారు. కానీ.. ఓ షోరూమ్ లో పనిచేసే సేల్స్ మ్యాన్.. ఆ చిన్నారుల ముఖాల్లో కొన్ని నిమిషాలపాటు చిరునవ్వుల్ని చూసేందుకు తనకు చేతనైన పనిచేశాడు.

అతను పనిచేసే షోరూమ్ లో ఉంచిన బిగ్ స్క్రీన్ టీవీలో పిల్లలు ఎంతో ఇష్టంగా చూసే కార్టూన్ వీడియోలు పెట్టి వారిని ఆనందింపజేశాడు. ఈ స్పెషల్ మూమెంట్స్ ను ఎవరో వీడియోతీసి ఎక్స్ లో పోస్ట్ చేయగా.. ఆ వీడియో వైరల్ అవుతూ.. నెటిజన్ల మనసుల్ని దోచుకుంటోంది. ఇది కదా నిజమైన మానవత్వం, కెమెరాల ముందు ఫేక్ స్మైల్ ఫేసులు లేవు, కేవలం అవగాహన మాత్రమే కనిపించేలా ఉన్న వీడియోను చూసి మనం చాలా నేర్చుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ పిల్లలకు తమకు నచ్చిన కార్టూన్ ఛానల్ పెట్టి చూపించిన ఆ సేల్స్ మ్యాన్ కు ఎంత డిగ్నిటీ ఉందో అర్థమవుతోందని, వారి ముఖాల్లో చిరునవ్వులు చిందించిన అతనికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇలాంటి చిన్నపాటి సహాయాలే సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని కొనియాడుతున్నారు. ఈ ఘటన తమిళనాడులోని డార్లింగ్ డిజిటల్ వరల్డ్ షోరూమ్ బయట జరిగింది. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Next Story