- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నడ పద్యం పాడిన రష్యన్ చిన్నారి.. నెట్టింట క్యూట్ వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఓ రష్యన్ చిన్నారి వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అందులో ఆ చిన్నారి అద్భుతంగా కన్నడ పద్యం పాడటం మనం చూడవచ్చు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత ఆధునిక యుగంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పిల్లలు తమ మాతృభాషను పూర్తిగా విస్మరించే పరిస్థితి నెలకొంటుంది. ఇది కేవలం మాటల పరంగా మాత్రమే కాక, తమ సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక విలువలతో ఉన్న అనుబంధాన్ని కూడా దూరం చేస్తోంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఓ రష్యన్ చిన్నారి వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది. అందులో ఆ చిన్నారి అద్భుతంగా కన్నడ (Kannada) పద్యం పాడటం మనం చూడవచ్చు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
బెంగళూరులో (Bangalore) ఇద్దరు చిన్నారులు సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్నారు. అందులో ఒకరు రష్యన్ (Russia) కాగా, మరొకరు ఇండియన్. వీరిద్దరూ గత మూడేళ్లుగా స్నేహితులుగా, క్లాస్‌మెట్స్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు కలిసి చక్కగా కన్నడ పద్యం బన్నడ హక్కి (రంగు రంగుల పక్షి) అనే పాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను రష్యన్ చిన్నారి తల్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు 2022లో స్నేహితులు అయినప్పటి నుంచి ఫొటోలు ఉన్నాయి. ఇక వీడియో చూసిన నెటిజన్లు చిన్నారుల స్నేహంతో పాటు రష్యన్ చిన్నారి కన్నడలో అద్భుతంగా పద్యం చెప్పాడాన్ని ప్రశంసిస్తున్నారు. అలాగే, 'విదేశీయులే కన్నడ నేర్చుకుంటే, మనవాళ్లు ఎందుకు మర్చిపోతున్నారు?' అంటూ కామెంట్లు పెడుతున్నారు.






