అన్నయ్యతో కలిసిపోయిన వదినమ్మ.. ఖుష్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. పోస్ట్ వైరల్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-14 15:13:12  IST  )

ఒకప్పటి యంగ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇందుకు కారణం డైరెక్టర్ త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని డైరెక్ట్‌గానే చెప్తుంది. వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తనను మోసం చేశారని కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. ఇండైరెక్ట్‌గా పవన్‌కు భార్య అయ్యేదాన్ని కానీ

అన్నయ్యతో కలిసిపోయిన వదినమ్మ.. ఖుష్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. పోస్ట్ వైరల్..
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పటి యంగ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇందుకు కారణం డైరెక్టర్ త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని డైరెక్ట్‌గానే చెప్తుంది. వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తనను మోసం చేశారని కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. ఇండైరెక్ట్‌గా పవన్‌కు భార్య అయ్యేదాన్ని కానీ కొందరి వల్ల అది ఫలించలేదని తిట్టిపోస్తుంది. అలాంటి పూనమ్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి ఓ ఆర్ట్ వర్క్ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆయనతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది.

ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. అన్నయ్యతో వదినమ్మ కలిసిపోయిందా ఏంటని కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అందుకే చంద్రబాబును కలిసి ఉంటుందని.. తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌ను మీట్ అయ్యుంటందని ఇమాజిన్ చేసుకుంటున్నారు. హీరోయిన్‌గా నెక్స్ట్ లెవల్‌లో ఉండాల్సిన అమ్మాయిని ఇలా చూడటం బాధేస్తుందని కొందరు అంటుంటే.. అమరావతి అభివృద్ధిలో భాగం కావాలని ఇంకొందరు కోరుతున్నారు. ఒకవేళ పొత్తు పెటాకులైతే పవన్ మీద పోటీ చేసేందుకు అవకాశమివ్వాలనే చంద్రబాబును కలిసిందని మరికొందరి సందేహం.

Next Story