- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేషన్ కార్డుల పంపిణీలో రగడ.. కాంగ్రెస్ నేతపై బాటిల్ విసిరిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అధికార, విపక్ష నేతల మధ్య రణరంగాన్ని తలపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అధికార, విపక్ష నేతల మధ్య రణరంగాన్ని తలపిస్తోంది. ఇటీవల మహేశ్వరం నియెజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి, కేఎల్ఆర్ వర్గీయుల మధ్య వివాదం మరువక ముందే ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఆసిఫాబాద్‌లో అధికారులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమె ప్రసంగిస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చెబుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్‌నాయక్ ఆమెను వారించారు. గత ప్రభుత్వ విషయాలు ఇప్పుడెందుకని ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో అగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి, శ్యామ్ నాయక్‌పై వాటర్ బాటిల్ విసిరారు. అంతటితో ఆగకపోవడంతో అక్కడున్న అధికారులు ఆమెను సముదాయించారు. ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు.






