డిపోలో ఆర్టీసీ బస్సు మాయం.. కట్ చేస్తే జరిగింది ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-11 04:29:25  IST  )

సాధారణంగా దొంగలు రెండు రకాలు.

డిపోలో ఆర్టీసీ బస్సు మాయం.. కట్ చేస్తే జరిగింది ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా దొంగలు రెండు రకాలు. కాస్లీ దోపిడీలు చేసే వారు కొందరైతే పేరు కోసం చేసేవాళ్లు మరికొందరు. ఇటీవల సోషల్ మీడియా (Social Media), యూట్యూబ్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా చిత్రవిచిత్ర దొంగతనాలు, దోపిడీలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఒంగోలు (Ongole) బస్టాండ్‌లో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సు (RTC Bus)ను అపహరించుకుపోయాడు. డిపో సమీపంలో పార్క్ చేసిన బస్సును ఓ లారీ డ్రైవర్‌ను గుట్టుచప్పుడు కాకుండా కొట్టేశాడు. దీంతో అప్రమత్తమైన డిపో సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. రంగంలోకి దిగిన వారు సీసీ కెమెరాల సాయంతో గంటల వ్యవధిలోనే బస్సును బైపాస్ రోడ్డు వద్ద గుర్తించి అనంతరం డిపో వద్దకు తీసుకొచ్చారు. బస్సు ఎత్తుకెళ్లిందని ఆరా తీయగా.. ఓ మతి‌స్థిమితం లేని లారీ డ్రైవర్ అని తెలిసింది.

Next Story