గేదెకు రూ.14 లక్షలు! ప్రత్యేకత ఏంటంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-01 04:14:01  IST  )

సాధారణంగా గేదెలు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు మార్కెట్‌లో లభిస్తాయి. మేలు జాతికి చెందినవైతే అత్యధికంగా రూ.2 నుంచి 3 లక్షల వరకూ పలకవచ్చు.

గేదెకు రూ.14 లక్షలు! ప్రత్యేకత ఏంటంటే?
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా గేదెలు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు మార్కెట్‌లో లభిస్తాయి. మేలు జాతికి చెందినవైతే అత్యధికంగా రూ.2 నుంచి 3 లక్షల వరకూ పలకవచ్చు. కానీ గుజరాత్‌ (Gujarath) రాష్ట్రం కచ్ జిల్లాలో మాత్రం ఓ గేదె ఏకంగా రూ.14.1 లక్షలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది! ఇది ఈ రాష్ట్ర పశుపోషణ రంగంలో ఓ మైలురాయిగా చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్లితే.. బన్నీ (Bunny) జాతికి చెందిన ఈ గేదె‌ను లఖ్‌పత్ తాలూకాలోని సంధ్రో గ్రామానికి చెందిన గజీ హాజీ అలాదాద్ ఎంతో ప్రత్యేక శ్రద్ధతో పెంచారు. ఇటీవల సెర్వా గ్రామానికి చెందిన షెరుబాయ్ బాలు అనే రైతు రూ.14.1 లక్షల చెల్లించి ఈ గేదెను కొనుగోలు చేశారు. గుజరాత్‌లో గేదెలకు ఇప్పటివరకు పలికిన అత్యధిక ధరగా పేర్కొంటున్నారు. బన్నీ జాతి గేదెలు కచ్ ప్రాంతానికి ప్రత్యేకమైనవి. ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇవి తక్కువ నీటితో జీవించగలగడం, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోగలగడం, రోజుకు 12–18 లీటర్ల వరకు అధిక నాణ్యత గల పాలివ్వగలగడం వీటి ముఖ్య లక్షణాలు. పాలలో కొవ్వు శాతం కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉంటుంది.

Next Story